వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60 స్కాములు..30 వేల కోట్ల దోపిడీ.. తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

బీహర్ ప్రచారం హీటెక్కింది. రెండో విడత ప్రచారం మరో రెండురోజుల్లో ముగియనుండటంతో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన ఆరోపణలకు మరింత పదును పెట్టారు. సీఎం నితీశ్ కుమార్ లక్ష్యంగా ఆరోపణలు సంధిస్తున్నారు. ఈ సారి నితీశ్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విరుచుకుపడ్డారు.

 ముంబై రోడ్లపై ఫ్రాన్స్ అధ్యక్షుడి పోస్టర్ల కలకలం: ఉగ్రవాదులకు మద్దతా? అంటూ బీజేపీ ముంబై రోడ్లపై ఫ్రాన్స్ అధ్యక్షుడి పోస్టర్ల కలకలం: ఉగ్రవాదులకు మద్దతా? అంటూ బీజేపీ

గత ఐదేళ్లలో నితీశ్ సర్కార్ అవినీతి చేసిందని తేజస్వీ ఆరోపించారు. 60 స్కాములు చేశారని.. దీంతో 30 వేల కోట్ల ప్రజాధానం వృథా అయ్యిందని తెలిపారు. పశుదాణా, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థుల స్కాలర్ షిప్ పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. అయితే 2015లో ఎన్నికలు జరగగా రెండేళ్లు జేడీయూతో కలిసి ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. తర్వాత జేడీయూ-బీజేపీతో పొత్తు కుదుర్చుకొని అధికారం చేపట్టింది.

60 scams under Nitish rule Tejashwi alleged

Recommended Video

Bihar Elections Phase 1 : ఆర్ధికాంశాల ప్రభావంతో తమ ఓటును నిర్ణయించబోతున్నబీహారీలు...!!

ఇవాళ హజిపూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేస్తారు. రోడ్ షో తీయనుండగా.. ఇప్పటికే భారీగా జనాన్ని సమీకరించారు. బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం కూటమి.. ఆర్జేడీ, బీజేపీ ఇతర పక్షాలు కలిసి పోటీనిస్తున్నాయి. ఎల్జేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ నెల 28వ తేదీన తొలి విడత 71 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 3వ తేదీన రెండో విడత పోలింగ్.. 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది.

English summary
RJD leader Tejashwi Yadav on Saturday alleged that 60 scams worth Rs 30,000 crore have taken place under the chief minister’s term till date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X