• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

60 ఏళ్ల బామ్మ.. 22 ఏళ్ల యువకుడు.. గాఢమైన ప్రేమ.. పెళ్లికి చిక్కులు..

|

ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. ఇది కూడా అలాంటి ఘటనే. 60 ఏళ్ల ఓ బామ్మ 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఇరువురి కుటుంబాలు అడ్డుపడ్డాయి. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా.. ఆఖరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా వారి మనసు మారలేదు. చివరకు, వీరిద్దరి కారణంగా ఆ ప్రాంతంలో తరుచూ గొడవలు, న్యూసెన్స్ జరుగుతోందని పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన 60 ఏళ్ల ఓ వృద్దురాలికి ఏడుగురు కొడుకులు,ఏడుగురు మనువలు కూడా ఉన్నారు. అదే కాలనీకి చెందిన 22 ఏళ్ల యువకుడు, ఆ వృద్దురాలు ప్రేమలో పడ్డారు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలు ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. ఇదే క్రమంలో గురువారం ఆ వృద్దురాలి కొడుకు,భర్త ఆ యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అదే సమయంలో ఆ యువకుడి కటుంబ సభ్యులు,కొంతమంది యూత్ అక్కడికి వచ్చారు.

60-year-old mother of 7 kids falls in love with 22-year-old man in Agra, FIR registered

ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. అనంతరం ఆ వృద్దురాలిని,యువకుడిని పోలీస్ స్టేషన్‌కు రప్పించి మాట్లాడారు. తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని.. వారు పోలీసులతోనూ చెప్పారు. ఇది సరైంది కాదని పోలీసులు వారికి నచ్చజెప్పి చూసినప్పటికీ లాభం లేకపోయింది. తాము పెళ్లి చేసుకుని తీరుతామని వారు చెబుతున్నారు. అయితే వారి బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ఇరువురి కుటుంబాలు చెబుతున్నాయి. పోలీసులు చేసేది లేక.. కాలనీలో గొడవలకు కారణమవుతున్నారని వారిద్దరి మీద న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.

English summary
In Uttar Pradesh's Agra, a 22-year-old man fell in love with a woman who is the mother of seven children, grandmother of seven kids. The woman is 60 years old.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X