• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంలో 62 శాతం మగువలు సెక్స్టింగ్‌లో బిజీ- 19 శాతం సెల్‌ఫోన్‌లోనే పార్ట్‌నర్స్‌- షాకింగ్‌ స్టడీ

|

ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్‌ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, యువత ఇలా ప్రతీ ఒక్కరూ సెల్‌ఫోన్‌ లేకుండా జీవించలేని పరిస్ధితికి చేరుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ వాడకం ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేస్తోంది. అలాగే జీవన విధానాల్లోనూ పెను మార్పులు తీసుకొస్తోంది. మరోవైపు మెబైల్‌ ఫోన్ల వాడకంలో మహిళలు పురుషుల కంటే ముందున్నారని తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు మొబైల్‌ ఫోన్లను ఎందుకోసం వాడుతున్నారో తెలుసుకునేందుకు ఓ అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ నిర్వహించిన అధ్యయనంలో భారతీయ మహిళలకు సంబంధించి షాకింగ్‌ వాస్తవాలు వెలుగుచూశాయి.

సైన్స్‌ జర్నల్‌ సర్వే...

సైన్స్‌ జర్నల్‌ సర్వే...

ప్లస్‌ వన్‌ అనే అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ తాజాగా మొబైల్‌ వాడకం వివిధ దేశాల్లో ఎలా ఉంది. వాడుతున్న వాళ్లలో ఎవరు ఏయే విషయాలు ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నారు, ఎవరెవరు ఏయే పనుల కోసం ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడుతున్నారనే అంశాలపై ఈ అధ్యయనం సాగింది. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో దాదాపు లక్షా 30 వేల మందికి పైగా మొబైల్‌ వినియోగదారులపై ఈ అధ్యయనం సాగింది. ఈ అధ్యయనం పూర్తిగా మహిళలపైనే సాగింది. ఇందులో ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ మహిళలకు సంబంధించిన వివరాలు కాస్త షాకింగ్‌ గా కనిపించాయి. ముఖ్యంగా భారతీయ మహిళల జీవన విధానాల్లో సెల్‌ఫోన్‌ తెచ్చిన మార్పు దీని ద్వారా స్పష్టమవుతోంది.

62 శాతం మంది సెక్టింగ్‌...

62 శాతం మంది సెక్టింగ్‌...

అంతర్జాతీయంగా చూస్తే మొబైల్‌ పరిభాషలో టెక్ట్సింగ్‌ అంటే మెసేజ్‌లు, మెయిల్స్‌ పంపుకోవడం. అలాగే సెక్టింగ్‌ అంటే సెక్స్‌కు సంబంధించిన సందేశాలు. ఫొటోలు, వీడియోలు పంపుకోవడం. భారత్‌లో ఇలా పంపుతున్న మహిళల శాతం సెల్‌ పోన్‌ వాడుతున్న మొత్తం మహిళల్లో 62 శాతం ఉందని ఈ అధ్యయనం తేల్చింది. అంటే మన దేశంలో ఉన్న మహిళల్లో 62 శాతం మంది ఏదో ఒక రూపంలో ఈ సెక్స్టింగ్‌లో బిజీగా ఉంటున్నారని అధ్యయనం తెలిపింది. వీరిలో సగానికి పైగా ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇలా సెక్టింగ్‌ ద్వారా మెసేజ్‌లు, ఫొటోలు పంపుతున్నారని, అలాగే ఇతరుల నుంచి వీరికి వస్తున్నాయని కూడా తేలింది. మన దేశంలో ర్యాండమ్‌గా 23 వేల మందిని ప్రశ్నించినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా ఈ సెక్స్టింగ్‌ అవగాహన బాగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనం బట్టి తెలుస్తోంది.

లింగ వివక్ష ఉన్న చోటే ఎక్కువ..

లింగ వివక్ష ఉన్న చోటే ఎక్కువ..

అంతర్జాతీయంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో లింగ వివక్ష ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే సెక్స్టింగ్‌ ఎక్కువగా జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. సాధారణ ప్రాంతాలతో పోలిస్తే లింగ వివక్ష ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాలుగు రెట్లు అధికంగా సెక్టింగ్‌ జరుగుతున్నట్లు తేలింది. అలాగే లింగ వివక్ష అధికంగా ఉన్న ప్రాంతాల్లో మహిళలు ఇతర ప్రాంతాల మహిళల కంటే రెండు రెట్లు అధికంగా పురుషులతో సంబంధాలు పెంచుకునేందుకు సెక్టింగ్‌ను సాధానంగా వాడుతున్నట్లు స్పష్టమైంది. ఇలా లింగ విపక్ష లేని ప్రాంతాల్లో అయితే మహిళలు లైంగిక సంబంధాల గురించి తెలుసుకునేందుకు మాత్రమే యాప్‌లను ఎక్కువగా వాడుతున్నట్లు తేలింది.
లైంగిక జీవితాల్లో టెక్నాలజీ పాత్రను ఈ అధ్యయనం స్పష్టం చేస్తుందని అంతర్జాతీయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

  Top News Of The Day : Journalist Taken Into Custody For Passing Information To Chinese Intelligence
  19 శాతం భాగస్వాములు ఫోన్‌ ఎంపికలే...

  19 శాతం భాగస్వాములు ఫోన్‌ ఎంపికలే...


  దేశవ్యాప్తంగా ఉన్న మహిళల్లో సెల్‌ఫోన్‌ వాడుతున్న వారిలో 19 శాతం మంది మహిళలు తమ భాగస్వాములను ఫోన్లలోనే ఎంపిక చేసుకుంటున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. వీరంతా సోషల్ మీడియా యాప్‌లు, ఇతరత్రా మార్గాల్లో ఫోన్లలోనే తమ భాగస్వాములను ఎంపిక చేసుకుంటున్నారు. వీరిలో కొందరు పెళ్లిళ్ల కోసం భాగస్వాములను ఎంపిక చేసుకుంటుండగా.. మరికొందరు లివింగ్‌ రిలేషన్‌షిప్స్‌ కోసం కూడా వీరిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఫోన్‌ ద్వారా భాగస్వాములను ఎంపిక చేసుకుంటున్న మహిళల సగటు 21 శాతం ఉండగా.. భారత్‌లో మాత్రం 19 శాతం ఉంది. ఇక్కడి వివాహ వ్యవస్ధ, సంప్రదాయాలే ఇందుకు కారణంగా అర్ధమవుతోంది.

  English summary
  a new study published in science journal "plos one" reveals that 62 percent of the indian women engage with sexting and 19 percent women find their partners via mobile phones.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X