• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళలో కరోనా కరతాళ నృత్యం..!ఒక్కసారిగా 64 పాజిటీవ్ కేసులు..!!

|

తిరువనంతపురం/హైదరాబాద్: కరోనా మహమ్మారికి ఇక్కడ, అక్కడ అనే ప్రాంతీయ భేదం అస్సలు తెలియనట్టుంది. నిన్నటి వరకూ కరోనా రహిత రాష్ట్రంగా దేశంలోనే గుర్తింపు పొందిన కేరళ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతోంది. ఎండాకలం వైరస్ తగ్గుముఖం పడుతుందని భావించిన చాలా మంది కరోనా వ్యాప్తి చెందడం పట్ల ఖంగుతింటున్నారు. భారత దేశ వాతావరణానికి, వతావరణంలో ఉండే వేడి తీవ్రతకు వైరస్ క్షణాల్లో అంతం అవుతుందని అందరూ అభిప్రాయపడ్డారు, కాని అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కరోన వైరస్ కు ఎండల తీవ్రతకు అసలు సంబంధం లేదనే అంవాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

ప్రకృతి సిటిగా గుర్తింపుపొందిన కేరళ.. వికృత క్రీడ మొదలు పెట్టిన కరోనా..

ప్రకృతి సిటిగా గుర్తింపుపొందిన కేరళ.. వికృత క్రీడ మొదలు పెట్టిన కరోనా..

ప్రకృతికి పర్యాయ పదంగా గుర్తింపుపొందిన కేరళ రాష్ట్రానికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ప్రకృతి రమణీయతతో, పక్షుల కిలకిలారావాలతో, స్వచ్చమైన చల్లని గాలులతో నిత్యం పులకించిపోతుంది కేరళ రాష్ట్రం. అంతే కాకుండా ప్రకృతి వైద్యానికి దేశంలోనే ఎక్కడా లేని గుర్తింపు కేరళ రాష్ట్రానికి ఉంది. నేరాలు, అత్యాచారాలు చాలా తక్కువగా నమోదవ్వడమే కాకుండా విద్యావంతుల రాష్ట్రాంగా కూడా కేరళ ముద్ర వేసుకొంది. ఇలాంటి కేరళ రాష్ట్రంలో మొన్నటి వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య చాలా పరిమిత సంఖ్యలో నమోదయ్యాయి. కరోనా రహిత రాష్ట్రంగా ముద్ర కూడా వేసుకుంది కేరళ. సరిగ్గా ఇదే సమయంలో ఉన్నట్టుండి కేరళ రాష్ట్రం మీద కరోనా వైరస్ పంజా విసిరినట్టు తెలుస్తోంది.

కేసుల కట్టడిలో కేరళ బెస్ట్... కాని ఐదు రోజుల నుండి పెరుగుతున్న కేసులు..

కేసుల కట్టడిలో కేరళ బెస్ట్... కాని ఐదు రోజుల నుండి పెరుగుతున్న కేసులు..

భిన్న సంస్కృతులకు నిలయమైన కేరళ రాష్ట్రం పర్యాటక ప్రదేశంగా గొప్ప పేరు తెచ్చుకుంది. మానసిక ప్రశాంతతకోసమైనా, లేక ప్రకృతిలోని గొప్పదనం చూడాలనుకున్నా ముందు కేరళ రాష్ట్రానికే ప్రాధాన్యతనిస్తారు. అలాగా సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండడంతో విదేశీయులను సైతం కేరళ గణనీయంగా ఆకర్శిస్తుంటుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కేరళ రాష్ట్రం మీద కరోనా వైరస్ ప్రభావం చూపించింది. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల నుంచి కేరళకు వచ్చిన వారిలోనే వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు నిర్దారిస్తున్నారు. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారిని రాష్ట్రంలోకి తీసుకుని రావడం వల్లే ఇలాంటి ఉపద్రవం ముంచుకొచ్చిందని కేరళ ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోంది.

కొంప ముంచిని గల్ఫ్ వాసులు.. వారితోనే కరోనా వ్యాపించిందంటున్న అధికారులు..

కొంప ముంచిని గల్ఫ్ వాసులు.. వారితోనే కరోనా వ్యాపించిందంటున్న అధికారులు..

భార‌తదేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు ఎయభై రెండు వేలకు చేరువయ్యింది. ప్ర‌స్తుతం దేశంలో ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 51,401 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతుండ‌గా, 27,919 మంది బాదితులు డిశ్చార్జ్ అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం రెండువేల ఆరువందల నలభై తొమ్మిది మంది క‌రోనా బారిన‌ప‌డి మృతి చెందారు. కాగా, గ‌త కొద్దీ రోజులుగా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా త‌గ్గింద‌నుకున్నా, కేర‌ళ‌లో మ‌ళ్లీ తిరిగి ఊపందుకుంటోంది. గతవారం వరకు ప్రశాంతంగా ఉన్న కేరళలో కరోనా వైరస్‌ మరోసారిగా విరుచుకుపడింది. తాజాగా మరో 26 కరోనా పాజిటివ్‌ కేసులు నవెూదు కావడం ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌ర పెడుతోంది.

క్వారంటైన్ లో పెట్టకపోవడవడం పొరపాటు.. ఇప్పటినుండి అప్రమత్తంగా ఉంటామంటున్న ప్రభుత్వం..

క్వారంటైన్ లో పెట్టకపోవడవడం పొరపాటు.. ఇప్పటినుండి అప్రమత్తంగా ఉంటామంటున్న ప్రభుత్వం..

గడిచిన నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండడం కలవరినికి గురిచేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తాజాగా గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారి వల్ల కేసులు నవెూదు అవుతున్నాయని అధికారులు గర్తించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ముందుగానే పరీక్షలు నిర్వహించిన క్వారెంటైన్‌ కేంద్రాలకు పంపుతున్నామని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. మొత్తం 600కుపైగా పరీక్షలు నిర్వహించగా 64 పాజిటివ్‌ కేసులు తేలినట్లు వెల్లడించారు. గల్ఫ్‌ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారిని రాష్ట్రంలోకి తీసుకుని రావడం వల్లే కరోనా వైరస్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Doctors confirm that the virus symptoms are more frequent in people from the Gulf countries.The Government of Kerala regrets that such a catastrophe has been drowned out by bringing them to the state without any tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more