• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహారాజా పర్మిట్లపైనే ‘టాటా’ నజర్.. ఎయిరిండియా స్వాధీనంపై ఆశలు అందుకేనా!!

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: 'ప్రధానిగా నరేంద్ర మోదీ ఓ నవ భారతం అందించాలని అకుంటున్నారు. ఇందుకు మనం ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. భారత్‌ను కొత్తగా మలచడానికి అవసరమైన క్రియేటివిటీ, కెపాసిటీ ఆయనకు ఉన్నాయ'ని గతనెలలో ఒకటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అన్నారు! అవును మరి, పేద ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి.. వ్యాపార ఉద్ధండుల కోసం నిబంధనలను తుంగలో తొక్కి కేవలం మూడు రోజుల్లో నానో కారు ఫ్యాక్టరీకి భూకేటాయింపులు జరిపింది మొదలు నిన్న మొన్నటి 0/20 రూల్‌ - విస్తారా, ఎయిరిండియా వరకు కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్న ఆయన పాలనాపటిమ ఇప్పుడిప్పుడే అందరికీ అర్ధమవుతోంది.
ప్రైవేట్, కార్పొరేట్‌ వర్గాల బాగు కోసం సర్కార్ తీసుకుంటున్న పక్షపాత నిర్ణయాలు, పాలకుల వైఖరి, ప్రభుత్వాధినేతల సేవలు, పేరుకుపోయిన అప్పులు వెరసి భారతవైమానిక కీర్తి కిరీటమైన ఎయిరిండియాను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాయి. ఎయిరిండియాను చేజిక్కించుకోవాలని ఎప్పటినుండో ఉవ్విళ్లూరుతున్న టాటా గ్రూపు మాస్టర్‌ ప్లాన్‌ వెనుక బలమైన కారణం తాజాగా తేలడం విశేషం.

  Tata Sons New Chairman : Natarajan Chandrasekaran - Oneindia Telugu
   2036కల్లా బ్రిటన్‌ను అధిగమించనున్న భారత్ వైమానిక మార్కెట్

  2036కల్లా బ్రిటన్‌ను అధిగమించనున్న భారత్ వైమానిక మార్కెట్

  వచ్చే రెండు దశాబ్దాల్లో 33.7కోట్ల నూతన ప్రయాణికులతో కలిపి మొత్తం 47.8 కోట్ల భారతీయులు విమాన సేవలను వినియోగించుకోనున్నారని, ప్రస్తుతం దేశీయ విమానయానంలో మూడో స్థానంతో సరిపెట్టుకున్న భారత వైమానిక మార్కెట్‌, 2036 నాటికి యునైటెడ్‌ కింగ్‌ డమ్‌‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద ఇంటర్నేషనల్‌ వైమానిక మార్కెట్‌గా అభివద్ధి చెందనున్నదని, విమానయాన రంగంలో పెట్టుబడులకు భారతావని స్వర్గ ధామం అని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) తన తాజా సర్వేలో మరోమారు పేర్కొన్నది.

   చిగుళ్లు తొడుగుతున్న టాటా ఆశలు

  చిగుళ్లు తొడుగుతున్న టాటా ఆశలు

  గత మూడేళ్లుగా ఐఏటీఏ అధ్యయన ఫలితాలు విమానయాన ప్రగతిపై సానుకూలంగా ఉండటం, కొన్నేళ్లుగా విమానయానరంగం ప్రగతి పథాన పరుగులీనుతున్నదని వివిధ స్వచ్ఛంద సంస్థల సర్వేలు కూడా తెలపడంతో టాటాలకు విమానయాన రంగంలో మళ్ళీ అడుగుపెట్టాలన్న ఆశలకు చిగుళ్లు తొడిగాయి. అందుకు అనుగుణంగానే, 49శాతం వాటాలు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చి, 51 శాతం వాటాలతో విస్తారా కార్యకలాపాలను 2015లో టాటాసన్స్‌ ప్రారంభించింది. మలేసియా ఎయిర్‌ఏసియా బెర్హాద్‌ మన దేశంలో సేవలను ప్రారంభించిన ఎయిర్‌ఏసియా - ఇండియా సంస్థలో కూడా టాటాలు తమ వాటాలను నిలుపుకున్నారు.

  ఇలా మార్గం ఖరారు చేసుకున్న టాటా గ్రూప్

  ఇలా మార్గం ఖరారు చేసుకున్న టాటా గ్రూప్

  అంతర్జాతీయ రూట్లలో విమానాలను తిప్పే విమాన సంస్థలకు బయటి దేశాల పెట్టుబడులు, ప్యాసింజర్‌, గూడ్స్‌‌లను తరలించడం వల్ల వచ్చే లాభాలు దేశీయరూట్లలో విమానాలను తిప్పే విదేశీ విమానయాన సంస్థల కన్నా ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఐతే, ఏదైనా ఒక విమానయాన సంస్థ ఇరవైకి పైగా విమానాలను కలిగి ఉండి, స్వదేశంలో ఐదేండ్ల పాటు విమాన సేవలను అందిస్తే ఆ సదరు విమానయాన సంస్థకు చెందిన విమానాలు దేశీయ మార్గాలతో పాటు, విదేశీ రూట్లలో కూడా తమ సేవలను అందించవచ్చన్నది మనదేశంలో గత సంవత్సరం వరకు ఉన్న రూల్‌ దాని పేరే.. 5/20 రూల్‌! అయితే, ఆ రూల్‌ కాస్త ప్రస్తుతం 0/20 రూల్‌ గా మారింది. అంటే, ఏ విమానయాన సంస్థ అయిన 20కి పైగా విమానాలను కలిగి ఉండి దేశీయంగా‌లో విమానాలను నడుపుతుంటే, నేరుగా అంతర్జాతీయ సేవలను కూడా ప్రారంభించవచ్చు.

   నేరుగా అంతర్జాతీయ సర్వీసులు ఇలా నడుపొచ్చు

  నేరుగా అంతర్జాతీయ సర్వీసులు ఇలా నడుపొచ్చు

  అంటే విమానయాన సంస్థ అంతర్జాతీయ సేవలు అందించేందుకు ఐదేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జెట్‌ ఎయిర్‌ వేస్‌, స్పైస్‌ జెట్‌తో పాటు ఎయిరిండియా సంస్థ కూడా వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. ఇందుకు కారణం.. పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా, భారత ప్రధాని మోదీకి మధ్య ఉన్న సాన్నిహితం మూలంగానే, టాటాల పెట్టుబడులు ఉన్న విస్తారా, ఎయిర్‌ఏసియా సంస్థలకు లబ్ది చేకూర్చేలా 5/20 రూల్‌ ను మోడీ సర్కార్ మార్చిందని చెబుతారు. ప్రయివేట్‌ విమానాలతో విమానయాన రంగంలో దూసుకుపోతున్న టాటాలు.. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పర్మిట్లు కల ఎయిరిండియాను సైతం సొంతం చేసుకొని, మరింత ప్రగతి చెందాలని ప్రయత్నిస్తుండటం అందుకు అనుగుణంగా పావులు కదుపుతుండటం వ్యాపార దిగ్గజాలను సైతం ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నది.

  English summary
  The Tata Group, which founded Air India 85 years ago and was then forced to relinquish control, said it will look at bidding for the airline put up for sale by the government. If it acquires Air India, it will be 64 years after its nationalisation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X