‘65మంది పాకిస్థానీయులకు భారత పౌరసత్వం’
న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు అద్నన్ సమీతో పాటు 65 మంది పాకిస్థానీయులకు ఈ ఏడాది భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు బుధవారం రాజ్యసభలో వెల్లడించారు.

2016 సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో పాకిస్థానీయులు 65 మంది కాక, మరో 55 మంది విదేశీయులకు భారతీయ పౌరసత్వం ఇచ్చామని తెలిపారు. 2015లో 263 మంది పాకిస్థానీయులకు, 344మంది వేరే దేశాలకు చెందిన వారికి భారతీయ పౌరసత్వాన్ని కల్పించారు.
2014లో 267మంది పాకిస్థానీయులకు, 352 మంది ఇతరులు భారత పౌరసత్వం పొందినట్లు సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన పాకిస్థాన్ గాయకుడు అద్నన్ సమీకి భారత పౌరసత్వం ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications