వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంజెక్షన్‌కు భయపడి పారిపోయింది, చిరుతపులి బోనులో చిక్కుకున్న మహిళ

|
Google Oneindia TeluguNews

సూరత్: చిరుతపులిని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోనులో ఓ 65 ఏళ్ల మహిళ చిక్కుకుపోయింది. ఆమె రాత్రంతా చలికి వణికి అందులోనే ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆమెను బయటకు తీశారు. ఆమె తెలియకుండా చిరుత బోనులోకి వెళ్లి చిక్కుకుపోయింది. ఆమె అందులోనే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని తాపి జిల్లాలో చోటు చేసుకుంది. భాన్వాడీ గ్రామానికి చెందిన 65 ఏళ్ల కమ్లీ ఖుసాల్‌ చౌదరీ కొంతకాలంగా కీళ్లనొప్పులతో బాధపడుతోంది. ఈ నెల 26వ తేదీన ఆమె మరో గ్రామమైన లొతార్వాను దాటి ఓ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు ఇంజెక్షన్ ఇస్తానని డాక్టర్ చెప్పాడు.

65 yr old woman rescued after being trapped in leopard cage

ఆమెకు ఇంజెక్షన్ అంటే భయం. దీంతో ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి బయటపడింది. కాలినడకన ఇంటికి వస్తోంది. అదే సమయంలో లొతార్వాలో తిరుగుతున్న ఓ చిరుతపులిని బంధించేందుకు అధికారులు ఆ దారిలో బోనును ఏర్పాటు చేశారు.

చీకటిలో బోనును ఆమె గుర్తించలేదు. దానిని ఓ గేటుగా భావించి దాటే ప్రయత్నాలు చేసింది. ఆమె లోపలికి ప్రవేశించగానే బోను తలుపులు మూసుకుపోయాయి. బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో చలిలో రాత్రంతా ఆమె అందులోనే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం స్థానికులు బోను నుంచి ఆమెను బయటకు తెచ్చారు. జ్వరంతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు.

English summary
A 65-year-old woman was trapped inside a cage meant for leopards near her village in Tapi district on Wednesday. The elderly woman who has been identified as Kamli Khusal Chaudhary went to a dispensary for treatment of joint ailment. While she was returning to her home in Bhanwadi village, she entered the cage by mistake and was trapped for the entire night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X