వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: 68 మంది వైద్యులు, నర్సులు క్వారంటైన్, కరోనా లక్షణాలతో గర్భిణీ మృతి...

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ భగవాన్ మహావీర్ ఆస్పత్రి వైద్యులు, నర్సులు 68 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఓ గర్భిణీ బుధవారం రాత్రి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో చనిపోయారు. దీంతో మొత్తం 68 మందిని క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు స్పష్టంచేశారు.

వాయవ్య ఢిల్లీకి చెందిన గర్భిణీ సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆమె ఇటీవల విదేశాల నుంచి వచ్చారని తెలుస్తోంది. హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించిన విషయాన్ని తమ వద్ద దాచారని ఆస్పత్రి సిబ్బంది ఆరోపిస్తున్నారు. తమకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆమె దవాఖానలో చేరారని పేర్కొన్నారు. కానీ బుధవారం ఆమె పరిస్థితి మరింత విషమించింది. వెంటిలెటర్ మీద చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

 68 doctors, nurses of Bhagwan Mahavir hospital quarantine..

కానీ తర్వాత విదేశాల నుంచి వచ్చానని.. తనకు అక్కడ కరోనా వైరస్ బారిన పడినవారితో పరిచయం ఏర్పడిందని తెలియజేశారు. తన కుటుంబానికి చెందిన నలుగురు ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు క్వారంటన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారని గుర్తుచేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బందిలో గుబులు నెలకొంది. ఆ మహిళతో కాంటాక్ట్‌లో ఉన్న సిబ్బంది అందరినీ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

Recommended Video

New Infection In 3 To 11 Years Of Age Kids In AP

కరోనా వైరస్ సోకిన ఆరోగ్య కార్యకర్తల్లో 45 మంది ఢిల్లీకి చెందినవారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గర్బిణీకి వైరస్ ఉందా అనే విషయం శుక్రవారం స్పష్టత వస్తోంది. ఆమెకు వైరస్ ఉంటే.. వైద్య సిబ్బంది విధిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. లేదంటే మాత్రం క్వారంటైన్ నుంచి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.

English summary
68 doctors, nurses and staff of a government hospital in Delhi have been asked to be under home quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X