• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్ : కుక్కపై 68 ఏళ్ల వృద్దుడి లైంగిక దాడి... వీడియో లీక్.. తరుచూ అదే పని...

|

మహారాష్ట్రలోని ముంబైలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 68 ఏళ్ల ఓ వృద్దుడు వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసే అహ్మద్ షా అనే వ్యక్తిగా గుర్తించారు. అతను కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. బాంబే యానిమల్ రైట్స్ అనే ఎన్‌జీవో సంస్థ ఆ వీడియోను పోలీసులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

తరచూ ఇదే పని...

తరచూ ఇదే పని...

బాంబే యానిమల్ రైట్స్ ఎన్‌జీవో కథనం ప్రకారం... నిందితుడు అహ్మద్ షా జుహు గల్లీలో ఒంటరిగా నివసిస్తున్నాడు. గతంలోనూ పలుమార్లు జంతువులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంలో స్థానికులు కూడా పలుమార్లు అతన్ని హెచ్చరించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల ఓ వ్యక్తి బాంబే యానిమల్ రైట్స్ సంస్థకు ఫోన్ చేసి అతని గురించి చెప్పాడు. వీధి కుక్కలపై అతను తరుచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు

కేసు నమోదు చేసిన పోలీసులు

గతేడాది డిసెంబర్‌లో అతను ఓ కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతుండగా తీసిన వీడియోను ఆ సంస్థ ప్రతినిధులకు పంపించాడు. గతంలో ఎందుకు అతనిపై ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించగా... పలుమార్లు అతన్ని హెచ్చరించామని,మారుతాడని భావించినప్పటికీ అతని ప్రవర్తన మారలేదని చెప్పాడు.రెండు రోజుల క్రితం బాంబే యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌ విజయ్ మోహన్‌కు ఆ వీడియో చేరగా... అతను దాన్ని పోలీసులకు అందజేశాడు. విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అహ్మద్ షాపై ఐపీసీ సెక్షన్ 429,ఐపీసీ సెక్షన్ 377ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ఇటీవల మైసూర్‌లోనూ....

ఇటీవల మైసూర్‌లోనూ....

గత నెలలో కర్ణాటకలోని మైసూర్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. మైసూర్ లోని గోకులం 3వ స్టేజ్‌లో నివసించే సోమశేఖర్(26) అనే యువకుడు వీధికుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో కొంతమంది స్థానిక యువకులు దాన్ని రహస్యంగా వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ (పీఎఫ్‌ఎ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ వీడియోని వీవీపురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదైంది. నిందితుడు సోమశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నేరం రుజువైతే అతనికి పదేళ్ల జైలు శిక్ష పడుతుందని జంతు సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. మనిషిలో ఉండే వక్రీకృత లైంగిక ప్రవర్తనే ఇటువంటి ఘటనలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు ఎలాగోలా లైంగిక కోరికను తీర్చుకోవాలనుకుంటారని... ఇందుకోసం జంతువులపై లైంగిక దాడికి కూడా వెనుకాడరని అంటున్నారు.

English summary
In a shocking incident, a 67-year-old hawker was arrested for allegedly having unnatural sex with a female stray dog in suburban Andheri West, after an animal welfare NGO submitted a video as proof. According to The Indian Express, Ahmad Shah, a vegetable vendor and a resident of Juhu galli, was arrested after Vijay Mohnani from NGO Bombay Animal Rights, submitted a video to the police in which Shah could be seen raping the dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X