వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:వావ్.. విద్యార్థి, నాణ్యమైన విద్య కావాలట.. సీఎంను అడిగిన ఆరో తరగతి బుడతడు

|
Google Oneindia TeluguNews

విద్యార్థులకు నాణ్యమైన విద్య, జనానికి ఉచిత వైద్యం అందిస్తే చాలు.. వారి బతుకు వారే జీవిస్తారని అంటారు. అవును.. జనాలకు ఉచితం పేరుతో పథకాలు ఇవ్వొద్దు.. కానీ విద్య, వైద్యం మాత్రం ఫ్రీగా ఇవ్వాలని కోరతారు. ఇదీ ముమ్మాటికీ నిజం కూడా. కానీ ఇతర పథకాల పేరుతో ప్రజలను మభ్య బెడుతూనే ఉన్నారు. బీహర్ సీఎం నితీశ్ కుమార్‌కు వింత అనుభవం ఎదురయ్యింది. సోను కుమార్ అనే విద్యార్థి తనకు మెరుగైన విద్య కావాలని అడిగాడు. అందుకు గల కారణం కూడా వివరించాడు. అతని మాటలు విన్న సీఎం.. తర్వాత ఓకే అని చెప్పాడు.

సీఎంకు విద్యార్థి మొర..

సీఎంకు విద్యార్థి మొర..

ఇటీవల సీఎం నితీశ్ నలందలో పర్యటించారు. అక్కడ ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి నితీశ్‌కు తన బాధను చెప్పాడు. తనకు నాణ్యమైన విద్య కావాలని కోరారు. తన తండ్రి తాగుబోతు అని చెప్పాడు. తన చదువులకు అంతగా డబ్బులు ఇవ్వడని చెప్పాడు. మద్యం కోసమే డబ్బులు ఖర్చు చేస్తాడని వివరించాడు. తన భవిష్యత్ కోసం మంచి విద్య కావాలని అతను అడిగాడు. ఇది ముమ్మాటికీ అతని హక్కే.. అందుకు నితీశ్ కూడా సానుకూలంగా స్పందించాడు.

వీడియో వైరల్

ఈ ఘటన 15వ తేదీన జరిగింది. తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. తన న్యాయమైన డిమాండ్‌ను చిన్నారి అడిగారని పేర్కొన్నారు. అతనికి మంచి విద్యను అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. అంతమందిలో చిన్నారి.. మొహమాట పడకుండా తనకు కావాల్సింది అడిగారని పేర్కొన్నారు. చాలా మంది చిన్నారి ధైర్యాన్ని ప్రశంసించారు. యూ ఆర్ గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

ప్రాథమిక హక్కే...

విద్య అనేది ప్రాథమిక హక్కు.. కానీ కొందరు పేదరికంతో చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న వయస్సులో పనులు చేయాల్సి వస్తోంది. దీంతో వారు చదువుకొనలేని సిచుయేషన్.. బీహర్ లాంటి రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువే. అంతా కూలీ నాలీ చేసుకునే వారే ఎక్కువగా ఉంటారు. సో వారికి ప్రాథమిక విద్యే అందని ద్రాక్షగా మారుతుంది. అందుకే ఆ విద్యార్థి తన న్యాయమైన హక్కును సీఎంను అడిగాడు. మరీ అదీ నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

English summary
class 6 student met Bihar CM Nitish Kumar during his Nalanda visit on May 15. Sonu Kumar urged the chief minister to provide him with quality education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X