• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

4 రోజుల్లో ఆరో అత్యాచారం: పట్టపగలు కాలేజీ విద్యార్థినిని కారులోకి లాగేసుకుని..

By Ramesh Babu
|

గుర్గావ్: హర్యానాలో అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వారంలోనే వరుసగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకున్నాయి. తాజాగా గుర్గావ్‌లోని ఫరూఖ్‌నగర్‌లో ఓ కాలేజీ విద్యార్థినిపై అఘాయిత్యం జరిగింది. గత 4 రోజుల్లో ఇది ఆరో ఘటన కావడం సంచలనం కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళితే... గుర్గావ్‌లోని ఫరూఖ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థిని కాలేజీ నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన ఇంటికి తిరిగొస్తోంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆమెను అడ్డగించారు.

  దారుణం..రేప్ చేసి చంపేసి శవాన్ని రోడ్డు పక్కన పడేశారు..!

  6th Haryana rape in 4 days, this time it's a college girl

  ఆ విద్యార్థిని ప్రతిఘటించినా వారి పశుబలం ముందు ఫలితం లేకపోయింది. ఆమెను తమ కారులోకి లాగేసుకుని కారును అతి వేగంగా నడిపిస్తూ క్షణాల్లో అక్కడ్నించి మాయమయ్యారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.

  రోడ్డు పక్కనే కారాపి, ఆ విద్యార్థినిని బలవంతంగా సమీపంలోని తుప్పల్లోకి తీసుకెళ్లి, నగ్నంగా మార్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నగ్నంగానే ఆమెను సమీపంలోని ముషాయిద్‌పూర్ గ్రామ సమీపానికి కారులో తీసుకెళ్లి బయటికి తోసేశారు.

  దారుణం: 16 ఏళ్ల బాలికపై 9 నెలలుగా అత్యాచారం.. నిందితుల్లో ఇద్దరు పోలీసు అధికారులు!

  కన్నీటి పర్యంతమైన ఆ విద్యార్థిని జరిగిన అఘాయిత్యం గురించి ఎవరికీ చెప్పనంటూ హామీ ఇచ్చాకే ఆమె దుస్తులు విసిరేసి వెళ్లిపోయారు. ఇంటికి తిరిగొచ్చాక జరిగినదంతా ఆమె తన తండ్రికి చెప్పడంతో గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

  హర్యానాలో జనవరి 13 నుంచి వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫరూఖ్‌నగర్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచరం ఘటన.. గత నాలుగు రోజుల్లో జరిగిన ఆరో అత్యాచారం.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Earlier this week, on the back of a series of violent crimes against women in the state, a college student returning home in Gurgaon's Farrukhnagar area was pulled into a car and raped by her two captors. The abduction happened during the daytime, at 2pm, and the two men drove into a nearby forested stretch, parked their car by the roadside and sexually assaulted the woman. A police complaint was filed only on Thursday when the woman told her father about it. It was the sixth reported rape in Haryana in four days beginning January 13, when the body of a 15-year-old girl - now referred to as Haryana's Nirbhaya - washed up at the bank of a canal in Jind.The Farrukhnagar rape survivor told police that her attackers pushed her out of the car nude after raping her in the nearby Mushaidpur village. They gave her clothes back only when she agreed not to talk to anyone about the attack.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more