వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రికి ప్రమాదం జరిగిందని విద్యార్థినిని పొదల్లోకి ఎత్తుకెళ్లిన కామాంధుడు, కట్టేసి నరాలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/వేలూరు: తండ్రికి ప్రమాదం జరిగిందని, తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఉన్నాడని స్కూల్ లో ఉన్న విద్యార్థిని నమ్మించి పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నం చేసిన యువకుడిని స్థానికులు చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి నరాలు పీకేశారు. స్థానికుల చేతులో తీవ్రగాయాలైన యువకుడికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కామంధుడు లైంగికదాడికి ప్రయత్నించడంతో గాయాలైన అమ్మాయిని తమిళనాడులోని వేలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!

6వ తరగతి అమ్మాయి

6వ తరగతి అమ్మాయి

తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాతం సమీపంలోని మేల్ పాడి గ్రామంలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతుల కుమార్తె (11) సమీపంలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఎప్పటిలాగే అమ్మాయి సాటి విద్యార్థులతో కలిసి స్కూల్ కు వెళ్లింది.

 కామాంధుడి కన్ను పడింది

కామాంధుడి కన్ను పడింది

అదే ప్రాంతంలోని కులితాయ్ గ్రామంలో వినోద్ (30) అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా 11 ఏళ్ల బాలిక మీద వినోద్ కన్ను పడింది. ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలని వినోద్ చాల కాలం నుంచి వేచి చూస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వినోద్ బాలిక చదువుతున్న స్కూల్ దగ్గరకు వెళ్లి చాల సమయం అక్కడక్కడే తిరిగాడు.

 తండ్రికి ప్రమాదం జరిగింది

తండ్రికి ప్రమాదం జరిగింది

విద్యార్థిని దగ్గరకు వెళ్లిన వినోద్ మీ తండ్రికి ప్రమాదం జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారని, నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాడని ఆమెకు మాయమాటలు చెప్పాడు. తండ్రికి ప్రమాదం జరిగిందని ఆందోళన చెందిన బాలిక బోరున విలపించింది. వెంటనే స్కూల్ టీచర్లకు సమాచారం ఇచ్చిన బాలిక వినోద్ తో కలిసి బైక్ లో అక్కడి నుంచి బయలుదేరింది.

పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి !

పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి !

మార్గం మద్యలో బైక్ నిలిపిన వినోద్ ను బాలికను బలవంతంగా పొదల్లోకి ఎత్తుకెళ్లి లైంగికదాడికి యత్నం చేశాడు. స్కూల్ టీచర్లు విద్యార్థిని తండ్రికి ప్రమాదం జరిగిందని బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరు ఇలా పుకార్లు చేశారని బాలిక తండ్రి కుటుంబ సభ్యులకు చెప్పాడు. బాలికను ఎవరు తీసుకెళ్లారు అనే అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గాలించడం మొదలుపెట్టారు.

వంకలో తప్పించుకుని ఎడుస్తూ !

వంకలో తప్పించుకుని ఎడుస్తూ !

కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి బాలిక కోసం గాలించారు. అదే సమయంలో వంక సమీపంలో వినోద్ చెర నుంచి తప్పించుకున్న బాలిక ఎడుస్తూ కేకలు వస్తూ పరుగు తీసింది. విషయం గుర్తించిన గ్రామస్తులు బాలికను రక్షించారు. గ్రామస్తులు వస్తున్నారని పసిగట్టిన వినోద్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే గ్రామస్తులు అతన్ని వెంటాడి పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదేశారు. గ్రామస్తుల చేతిలో తీవ్రగాయాలైన కామాంధుడు వినోద్ కు దిమ్మ తిరిగిపోయింది. విషయం తెలుసుకున్న గుడియాతం పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకుని వినోద్ ను వేలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల చితకబాదడంతో కామాంధుడు వినోద్ కు తీవ్రగాయాలైనాయి. బాలికను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

English summary
6th std girl sexually abused by youth near Gudiyatham in Tamil Nadu and case booked on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X