వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజ్ మేగజైన్: నెగెటివ్ లిస్ట్‌లో మోడీ, కేసు నమోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను 'నెగిటివ్ ఫేసెస్'లతో కలిపినందుకు కేరళలోని ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, మరో ముగ్గురి పైన కేరళ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. క్యాంపస్‌కు చెందిన మేగజైన్ నెగిటివ్ ఫేసెస్ లిస్ట్‌ను పేర్కొంది.

అందులో అడాల్ఫ్ హిట్లర్, ఒసామా బిన్ లాడెన్ వంటి వారి సరసన మోడీ ఫోటో గ్రాఫ్‌ను ఉంచారు. హిట్లర్, బిన్ లాడెన్, అజ్మల్ కసబ్, గంధపుచెక్క స్మగ్లర్ వీరప్పన్, ఎన్టీటీయీ ప్రభాకరన్, మాజీ అమెరికా ప్రధాని జార్జ్ డబ్ల్యూ బుష్, మరో ఐదుగురిని పేర్కొన్నారు. అందులో మోడీని జత చేశారు.

7 booked for Modi picture in ‘negative list’

ఈ మేగాజైన్ 2013-2014 అకడమిక్ ఇయర్‌కు సంబంధించిందని. నెగిటివ్ ఫేసేస్‌తో పాటు ప్రముఖులను వేరుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో థెరిస్సా, చె గువేరా, మహాత్మా గాంధీలు ఉన్నారు.

ఈ మేగజైన్ పైన బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ముందు ధర్నా చేశారు. మేగజైన్లను దగ్ధం చేశారు. ఎబివిపి ఫిర్యాదు మేరకు కున్నంకుళం పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Thrissur Kunnamkulam Government Polytechnic magazine puts PM Narendra Modi in list of most cruel people. the Kunnamkulam police filed registered suo-motu case against the editorial team of a college magazine. Modi's picture was placed among people like former Al Qaeda chief Osama Bin Laden, terrorist Ajmal Kasab, captured during the 2008 Mumbai terror attacks and former German dictator Adolf Hitler.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X