వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: జార్ఖండ్‌లో ఢిల్లీ తరహా ఘటన.. సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో బురారీ ప్రాంతంలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యల ఘటన మరువక ముందే జార్ఖండ్‌లో ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యహత్యకు పాల్పడ్డ వారిని దీపక్ ఝా , అతని భార్య సోనీ ఝా, కుమారులు రూపేష్ ఝా, కుతురు దృష్టి, చిన్న కుమారుడు గంజులుగా పోలీసులు గుర్తించారు. దీపక్ ఝా తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబం బీహార్‌లోని భగల్‌పూర్ నుంచి వలస వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పారు.

7 members of a family in Jharkhand commit mass suicide

ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం జార్ఖండ్ రాష్ట్రంలో ఇది రెండో సారి. అంతకుముందు ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జార్ఖండ్‌లో జరిగిన రెండు ఘటనలు ఢిల్లీ బురారీ ఆత్మహత్య కేసుతో పోలిఉన్నాయని పోలీసులు చెప్పారు. ఢిల్లీలో లలిత్ భాటియా కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడగా... 10 మంది ఒకే చోటు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భాటియా తల్లి నారాయణదేవి మాత్రం మరో గదిలో మృతిచెందింది. తాజాగా రెండు ఘటనల్లో కూడా ఇదే కనిపించింది.

English summary
Days after 11 members of a family allegedly committed suicide in Delhi's Burari area, seven members of a family have reportedly committed suicide in Jharkhand's capital Ranchi. SSP Anish Gupta told reporters that prima facie it appears to be a case of suicide. He said that initial investigations have revealed that the family, which originally hailed from Bhagalpur in Bihar, was under some kind of financial stress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X