వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత పోలీసు వ్యవస్థలో మహిళా పోలీసులు ఎంతమంది ఉన్నారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని పోలీస్ వ్యవస్థలో మహిళా పోలీసుల శాతం చాలా తక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 2.4 మిలియన్ పోలీసులు ఉండగా అందులో 7శాతం మహిళలు మాత్రమే పోలీసులుగా ఉన్నారు. మానవహక్కుల సంస్థలు, చట్టపరమైనవిధానాలు రూపొందించే సంస్థల్లో పనిచేసే నిపుణులు ది ఇండియా జస్టిస్ రిపోర్టు 2019 పేరుతో ఈ నివేదికను రూపొందించారు. ఇందులో 6శాతం మంది మహిళలు మాత్రమే పోలీస్ వ్యవస్థలో ఆఫీసర్లుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది.

 ఏడు శాతం మంది మహిళా పోలీసులు

ఏడు శాతం మంది మహిళా పోలీసులు


ఒక వేళ ఆయా రాష్ట్రాలు పోలీసు వ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం పెంచే యోచనలో భాగంగా ఏడాదికి ఒక్క శాతం పెంచిన 33 శాతం మహిళా రిజర్వేషన్లను అందుకునేందుకు కొన్ని దశాబ్దాలు పడుతుందని నివేదిక పేర్కొంది. ఇక పోలీసు వ్యవస్థలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల ప్రాతినిథ్యం కూడా తక్కువగానే ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలను ది ఇండియా జస్టిస్ రిపోర్టు 2019 బయటపెట్టింది. గత ఐదేళ్లలో 6.4 శాతం మంది పోలీసులు మాత్రమే సరైన శిక్షణ పొందారని చెప్పిన నివేదిక ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 90శాతం మంది పోలీసులు సరైన శిక్షణ పొందకుండానే విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించింది.

న్యాయవృత్తిలో 18శాతం మంది మహిళలు

న్యాయవృత్తిలో 18శాతం మంది మహిళలు

ఇక న్యాయవ్యవస్థలో కూడా మహిళా ప్రాతినిథ్యం తక్కువగానే ఉందని స్టడీ వెల్లడించింది. 18శాతం మంది మహిళలు న్యాయవృత్తిలో ఉన్నట్లు పేర్కొంది. భారతీయ కోర్టుల్లో దాదాపు 28 మిలియన్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అందులో 24శాతం కేసులు ఐదేళ్లు లేదా అంతకుమించి పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేసింది. బీహార్ ఉత్తర్‌ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, గుజరాత్, మేఘాలయా, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతి నాలుగు కేసుల్లో ఒక కేసు ఐదేళ్లకంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉందని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం మీద 10 ఏళ్లకంటే పెండింగ్‌లో ఉన్న కేసులు 2.3 మిలియన్‌గా ఉందని చెప్పింది. ఇక కోర్టుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించిందని వెల్లడించింది. దాదాపు 4,071 కోర్టులు ఇంకా వ్యవస్థలోకి రావాల్సి ఉందని వెల్లడించింది.

 యూపీ పోలీసు శాఖలో 50శాతం ఖాళీలు

యూపీ పోలీసు శాఖలో 50శాతం ఖాళీలు

2017లో ఉన్న సమాచారం పరిశీలిస్తే ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ శాఖలో 50శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక భారత్‌లో ఉన్న జైళ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే దేశంలో 1412 జైళ్లు ఉంటే వాటిని మానిటర్ చేసేందుకు పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిబ్బంది 621 మంది మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారిక సమాచారం ప్రకారం 95,366 మంది ఖైదీల పర్యవేక్షణకు పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన ఒక్క అధికారి మాత్రమే ఉన్నారని నివేదిక వివరించింది.

English summary
A report compiled by a group of sectoral experts, ranging from human rights groups to legal policy groups, show that woman account for seven per cent of India's 2.4 million police personnel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X