• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైమానిక దళ యుద్ధ విమానాలు ఏవో తెలుసా?.. గ్యాలియర్ నుంచి టేకాఫ్: హైదరాబాద్ లో తయారైన జెట్

|

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసిన ఘటనలో అత్యంత కీలకమైన యుద్ధ విమానాలను వినియోగించి వైమానిక దళం. తమ అమ్ములపొదిలో ఇన్నాళ్లూ భద్రంగా దాచుకున్న అస్త్రాలను వెలికి తీసింది. ఉగ్రమూకలపై దాడులు చేసింది. గురి తప్పలేదు. వైమానిక దళం సంధించిన బాంబులు, పేలుడు పదార్థాలతో కూడుకున్న క్షిపణులు లక్ష్యాన్ని ఛేదించాయి. ఉగ్రవాదులను తుద ముట్టించాయి. మొత్తం ఏడు యుద్ధ విమానాలను ఈ దాడుల కోసం ఉపయోగించింది వైమానిక దళం.

గ్వాలియర్ నుంచి టేకాఫ్ తీసుకున్న మిరాజ్

మిరాజ్ 2000: మంగళవారం నాటి దాడుల్లో కీలక పాత్రను పోషించాయి మిరాజ్ 2000 ఈ యుద్ధ విమానాలు. మొత్తం 12 యుద్ధ విమానాలను వినియోగించారు. ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ఈ జెట్ ఫైటర్లను తయారు చేసింది. 1980 నుంచీ మనదేశ వాయుసేనలో కీలకంగా పనిచేస్తున్నాయి ఈ రకం జెట్ ఫైటర్లు. పంజాబ్ లోని భటిండాలో మిరాజ్ యుద్ధ విమానాల బేస్ క్యాంపు ఉంది. అక్కడే ఓ సారి ట్రయల్ నిర్వహించారు. అనంతరం 1000 కేజీల బాంబులు, పేలుడు పదార్థాలను తీసుకుని మిరాజ్ 2000 విమానాలు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నుంచి టేకాఫ్ తీసుకున్నాయి.

గైడెడ్ బాంబ్ జీబీయూ- 12: పేవ్ వే లేజర్ గైడెడ్ బాంబులు ఇవి. కటిక చీకట్లో కూడా గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరుకునే బాంబులివి. లేజర్ తో పని చేస్తాయి. 12 లేజర్ గైడెడ్ బాంబులను తన వెంట తీసుకెళ్లింది వైమానిక దళం. దీన్ని అమెరికా తయారు చేసింది.

7 pieces of equipment used by the iaf in air strikes in pakistan

మాట్రా మేజిక్ క్లోజ్ కంబాట్ మిస్సైల్: ముందు జాగ్రత్తచర్యగా ఈ క్షిపణులను తీసుకెళ్లారు అధికారులు. ఉగ్రవాద శిబిరాలపై దాడుల సందర్భంగా ప్రతిదాడులు ఎదురైతే వాటిని ఉపయోగించాలని భావించారు. ఆ పరిస్థితి ఎదురు కాలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ మాట్రా దీన్ని తయారు చేసింది. దాదాపు అన్ని ప్రధాన దేశాలు దీన్ని తమ వాయుసైన్యంలో అందుబాటులో ఉంచుకున్నాయి.

లైట్నింగ్ పాడ్: గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించే అస్త్రం ఇది. నిర్దేశిత లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించే శక్తి దీనికి ఉంది. బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై వీటిని ప్రయోగించినట్లు తెలుస్తోంది.

7 pieces of equipment used by the iaf in air strikes in pakistan

నేత్రా: దీని పూర్తి పేరు నేత్రా ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ జెట్. డీఆర్డీఓ దీన్ని అభివృద్ధి చేసింది. హైదరాబాద్ కంచన్ బాగ్ లోని డీఆర్డీఓలో దీన్ని అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. ఈ జెట్ కు దిశా నిర్దేశం చేయాల్సిన పని లేదు. తనకు తానుగా రాడార్ సూచనలకు అనుగుణంగా దూసుకెళ్తుంది. యుద్ధంలో పాల్గొనే వాయు సైన్యానికి అవసరమైతే ఇది దారి చూపుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రముఖుల కాన్వాయ్ ముందు ఉండే పైలెట్ లా ఇది పని చేస్తుంది. అందుకే దీనికి నేత్రా అని పేరు పెట్టారు.

ఇల్యూషన్ 78 ఎం: ఇల్యూషన్ 78 ఎం ను రష్యా తయారు చేసింది. దీని ద్వారా శతృ స్థావరాలపై ఇంధనంతో దాడి చేస్తారు. దీనికి అవసరమైన ఇంధన ట్యాంకులను వీటి ద్వారా మోసుకెళ్లారు. ఆగ్రాలోని ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ లో భారీ ట్యాంకుల్లో ఇంధనాన్ని తీసుకెళ్లారు.

హెరాన్ డ్రోన్: హెరాన్ డ్రోన్ల ద్వారా ఇదివరకే వైమానిక దళం ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణా శిబిరాలను కనిపెట్టింది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అత్యంత రహస్యంగా హెరాన్ డ్రోన్ల ద్వారా ఉగ్రవాదుల ఆనుపానులు కనుగొన్నట్లు చెబుతున్నారు. దీని ఆధారంగానే బాలాకోట్, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలపై వైమానిక దళం దాడులు చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Air Force (IAF) jets crossed the Line of Control (LoC) and destroyed major terrorist camps in Balakot sector in a pre-dawn strike on Tuesday, sources said. The airstrike took place at 3.30 am, the sources said. Several Mirage 2000 aircraft dropped 1,000 kg bombs on terrorist camps across the LoC. Sources said terrorist launchpads in Balakot, Chakothi and Muzaffarabad were completely destroyed in the IAF airstrikes, and that Jaish-e-Mohammed (JeM) control rooms were also destroyed. Earlier, a spokesperson for the Pakistan Armed Forces claimed that the IAF violated the LoC, and that the Pakistan Air Force responded immediately, after which the Indian aircraft went back. India's airstrikes come days after Jaish, the Pakistan-based terrorist group, carried out a suicide bombing in Jammu and Kashmir, killing 40 CRPF soldiers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more