వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూపాయికే కిలో టమాట, 70 లారీల టమాటను రోడ్డుపై పోసి రైతుల ఆందోళన

ఒక్క రూపాయికే కిలో టమాటను విక్రయించాల్సిన పరిస్థితులు రావడంతో ఛత్తీస్ ఘడ్ లో రైతులు 70 లారీల టమాటలను రోడ్డుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఛత్తీష్ ఘడ్ : రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు దర లభించని కారణంగా రైతులు రోడ్డుపై తమ పంటను పోసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేనంతగా టమాటకు ధర పడిపోవడంతో సుమారు 70 లారీల టమాటను రోడ్డుపైనే పోసి ఆందోళన చేశారు.ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడ వచ్చే పరిస్థితిలేదు. టమాట ధర దారుణంగా పడిపోయింది. కిలో రూపాయికి విక్రయించాల్సిన పరిస్థితులు రావడంతో ఛత్తీస్ ఘడ్ కు చెందిన రైతులు దందా ప్రాంతంలో రోడ్డుపై టమాటలు పోసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

 70 trucks of tomatoes unloaded on road by farmers

టమాట ధరలు దారుణంగా పడిపోయాయి. నిల్వచేసుకొనే సౌకర్యం లేని కారణంగా రైతులు అనివార్యంగా విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అయితే ధరలు విపరీతంగా పడిపోవడంతో రైతులకు నిరాశే ఎదురైంది.

రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడంలో పాలకులు చొరవ చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ అధికారులు, పాలకులు సక్రమంగా పట్టించుకోని కారణంగా మనస్థాపానికి గురైన రైతులు రోడ్డుపై టమాటలు పోసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

English summary
where farmers unloaded 70 trucks of tomotoes on the road to protest , the protest was staged because tomatoes are at an all time low of rs.1 per kg .farmers protesta at dhamdha town of durg in chattisgarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X