వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:దినసరి కూలీ లలితమ్మ పెద్దమనస్సు, సీఎం సహాయనిధికి రూ.5 వేల సాయం...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ప్రభుత్వాల వద్ద డబ్బులేని పరిస్థితి. మనస్సున మారాజులు ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలు పిలుపిస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తలు స్పందించి పెద్దమొత్తంలో అందజేస్తున్నారు. అయితే కేరళలో దినసరి కూలీ ముఖ్యమంత్రి సహాయనిధికి నగదు అందజేశారు. తనకు తోచిన సాయాన్ని అందజేసి.. మంచి మనసును చాటుకొన్నారు.

కొల్లా జిల్లా తివళక్కర పంచాయతీ ఆరినల్లూరు వద్ద లలితమ్మ అనే (70) వృద్దురాలు ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా.. వారికి పెళ్లిళ్లు అయ్యాయి. పక్కనే ఉంటుండగా లలితమ్మ మాత్రం సొంతంగా పనిచేస్తూ ఉంటున్నారు. ఆమెకు నెలకు రూ.1200 పెన్షన్ వస్తుండగా.. ఉపాధి హామీ కూలీ పనిచేస్తుంటారు. దీంతోపాటు నగదును దాచిపెట్టే మంచి అలవాటు ఆమెకు ఉంది. ఏటా ఆరికొడ్ ఆలయంలో జరిగే ఉత్సవం కోసం తనవంతు సాయంగా ఎంతో కొంత ఇస్తుంటారు.

70-year-old Kerala daily wager donates meagre savings to CM Relief Fund

ఈసారి కరోనా వైరస్ వల్ల ఉత్సవం లేదు. తాను కూడబెట్టిన నగదును ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని భావించారు. తాను కూడబెట్టిన నగదును సొంత అవసరాలకు వాడుకొనని స్పష్టంచేశారు. వైరస్ విజృంభిస్తుంటే సీఎం రేయనగా.. పగలనక కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వైరస్ గురించి సమీక్షలు చేయడం, పరిస్థితిని సమీక్షించే అంశాలను తాను టీవీలో చూస్తున్నాననితెలిపారు.

Recommended Video

Lockdown: Kanpur Police Perform 'Aarti' Of People who Are Roaming Out During Lockdown

సీఎం సహాయనిధికి డబ్బులు ఇవ్వాలో అర్థం కాలేదు. తన ఇంటి నుంచి వెళ్లే పోలీసు వాహనాన్ని ఆపి.. విషయాన్ని చెప్పింది. మరునాడు సీఐ రాజేశ్ కుమార్ రావడంతో నగదు అందజేశారు. వారికి రూ.5 వేల 101 అందజేసింది. మరునాడు సీఎం సహాయనిధికి వచ్చిన నగదు వివరాలను పినరయి విజయన్ చదివి వినిపించారు. అందులో లలితమ్మ పేరు కూడా ప్రస్తావించారు. దీంతో ఆమె ఆనందానికి అవధి లేకుండా పోయింది. తాను సాయం చేయడం వార్తలకు ఎక్కుతుందని కూడా గ్రహించలేదని పేర్కొన్నారు. తన నగదును సీఎం సహాయనిధికి చేర్చిన పోలీసులకు కృతజ్ఙతలు తెలిపారు.

English summary
Every year Lalithamma would donate her year-long savings for the festival at the nearby Areekkode temple. but this donate her savings to cm relief fund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X