• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

70వ గణతంత్ర వేడుకలు: రాజ్‌పథ్ వద్ద కొనసాగుతున్న పరేడ్

|

జనవరి 26... భారత గణతంత్ర దినోత్సవం. ప్రతి ఏడు ఘనంగా దేశమంతా జరుపుకుంటుంది. ఈ సారి భారత దేశం 70 గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. ఈ సారి వేడుకలకు ప్రత్యేకత ఉంది. ఈ వేడుకల్లో"నారీశక్తి" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అస్సోం రైఫిల్స్‌ను మహిళలు లీడ్ చేస్తున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన 70 ఏళ్ల తర్వాత తొలిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన నాటి నలుగురు సైనికులు తొలిసారిగా పరేడ్‌లో కవాతు చేస్తున్నారు. వీరి వయస్సు 97 ఏళ్ల నుంచి 100 ఏళ్లలోపు ఉంటుంది. ఇందులో భగ్మల్ అనే సీనియర్ సైనికుడి వయస్సు 100 ఏళ్లు. హర్యానా రాష్ట్రంలోని మనేసర్ ప్రాంతానికి చెందినవారు. ఆయన లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో 1942లో చేరారు.ఇక ఆర్మీ పరేడ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఈసారి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రిక అధ్యక్షుడు సిరిల్ రామఫోస హాజరయ్యారు.

70th Republic day Live updates: India gears up for celebrations

Newest First Oldest First
11:28 AM, 26 Jan
రాజ్‌పథ్‌లో గణతంత్రవేడుకల్లో భాగంగా అతిథులను ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన విమాన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నపిల్లలు ఎయిర్‌షోను ఆస్వాదించారు
11:24 AM, 26 Jan
రాజ్‌పథ్‌లో పరేడ్‌లో భాగంగా ఒంటెలతో కవాతు నిర్వహించింది రాజస్థాన్ బీఎస్ఎఫ్ బ్యాండ్. హమ్ హై సీమా సురక్ష బల్ గీతాన్ని బ్యాండ్ ఆలపించింది. ఈ గేయం చేరివచ్చిన అతిథులను ఆకట్టుకుంది
11:20 AM, 26 Jan
అటారీ వాఘా సరిహద్దుల్లో 70వ గణతంత్రవేడుకల్లో భాగంగా పాకిస్తాన్ సైన్యానికి మిఠాయిలు పంచిపెట్టారు భారత జవాన్లు. ఈ సందర్భంగా పాక్ జవాన్లు భారత సైనికులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
11:04 AM, 26 Jan
అట్టారీ వాఘా సరిహద్దులో భారత జవాన్లు 70వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
10:41 AM, 26 Jan
రాజ్‌పథ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రదర్శన. శకటాల ప్రదర్శన అక్కడికి చేరివచ్చిన అతిథులను, ప్రజలను ఆకట్టుకున్నాయి.
10:13 AM, 26 Jan
త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం రామ్‌నాథ్ కోవింద్ స్వీకరిస్తున్నారు.సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్.
10:09 AM, 26 Jan
అమరసైనికుడు లాన్స్ నాయక్ అహ్మద్ వాణీకి అశోక చక్రను ఆయన సతీమణి మహజబీన్‌కు పురస్కారం ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్
10:05 AM, 26 Jan
విధి నిర్వహణలో ఉండి దేశంకోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేశారు రామ్‌నాథ్ గోవింద్. ఉగ్రవాదులతో పోరులో సైనికులు అమరులయ్యారు.
10:01 AM, 26 Jan
రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జాతీయగీతం ఆలపించారు. జాతీయజెండాకు వందనం చేశారు
9:58 AM, 26 Jan
వేదిక వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్, ఈ సారి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు.
9:54 AM, 26 Jan
ఇండియా గేట్ దగ్గర అమరజవాన్లకు నివాళులు అర్పించిన తర్వాత నేరుగా వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతం పలికారు. అనంతరం వేడుకలకు హాజరైన ప్రజలకు మోడీ అభివాదం చేశారు
9:49 AM, 26 Jan
ప్రధాని మోడీతో పాటు త్రివిధ దళాల అధినేతలు ఆర్మీ ఛీఫ్ బిపిన్ రావత్, ఎయిర్ ఛీఫ్ బీరేందర్ సింగ్ దనోవా, నేవీ ఛీఫ్ సునీల్ లంబాలు అమర జవాన్లకు నివాళులు అర్పించారు
9:45 AM, 26 Jan
ఇండియా గేట్ వద్ద ఉన్న అమరజవాన్ల స్థూపం వద్ద దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు
9:35 AM, 26 Jan
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లలో అర్ధకుంభమేళా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇక్కడ సాధు, సన్యాసులు గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. సాధువులు జెండా చేతబూని, జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు.
9:33 AM, 26 Jan
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద మరికొద్దిసేపట్లో పరేడ్ ప్రారంభం కానుంది. ఉదయం గం.9.50 నిమిషాలకు ప్రారంభమవతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పిస్తారు.
9:28 AM, 26 Jan
70వ గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు ఢిల్లీలోని తమ తమ అధికారిక కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
9:27 AM, 26 Jan
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయపూర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భాగ్‌లే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాకు వందనం చేస్తున్న ముఖ్యమంత్రి, తదితరులు.
9:25 AM, 26 Jan
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జెండా వందనం చేస్తున్న ముఖ్యమంత్రి, తదితరులు.
8:41 AM, 26 Jan
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 30వేల మంది ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వేడుకలకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ
8:33 AM, 26 Jan
విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు పరేడ్ జరుగుతుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 17 శకటాలు పరేడ్‌లో ప్రదర్శన ఇస్తాయి. ఇందులో కేంద్రానికి చెందిన 6 శకటాలు ఉన్నాయి
8:29 AM, 26 Jan
భద్రతా దృష్ట్యా రాజ్‌పథ్, సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్‌లలో మెట్రో సేవలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు
7:40 AM, 26 Jan
70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హిందీలో ఇంగ్లీషులో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
7:06 AM, 26 Jan
హిమాలయాల్లో 18వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
7:03 AM, 26 Jan
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. చారిత్రక కట్టడాలు శోభాయమానంగా మారాయి. పూరీ తీరంలో సైకత శిల్పం కొలువుదీరింది.
6:42 AM, 26 Jan
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా అన్నిచోట్ల తనిఖీలు చేపట్టారు. రహదారిపై వెళ్తున్న వాహనాల్లో అనుమానం ఉంటే ఆపి తనిఖీలు నిర్వహించారు.
6:41 AM, 26 Jan
దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకల్లో వీవీఐపీలు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రయాణం చేసే వారికి ఇబ్బందులు లేకుండా ఢిల్లీ పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఎర్రకోట, విజయ్ చౌక్ పరేడ్ మధ్య రూట్ మ్యాప్ విడుదల చేశారు.
6:36 AM, 26 Jan
గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఢిల్లీ ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ముఖ్య అతిథిగా సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామాఫోస్ వస్తున్నారు. అతను తన సతీమణి, ఆ దేశ ఫస్ట్ లేడీ షెపో మోసెపేతో కలిసి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
6:33 AM, 26 Jan
70వ గణతంత్ర వేడుకలకు భారత దేశం సిద్ధమైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India will celebrate its 70th Republic Day on Saturday with a dazzling display of 'Nari Shakti', led by the Assam Rifles contingent. The Army parade will begin at 10 am following the Investiture Ceremony and the National Salute. But, This year’s Republic Day parade will witness a series of firsts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more