• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వందేమాతరం: ఇమ్రాన్‌ యుద్ధం గురించి మాట్లాడారు..మోడీ అభివృద్ధి గురించి మాట్లాడారు

|

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ శోభ కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చి 10వారాలు అయ్యిందని ... ఇంత తక్కువ సమయంలో అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, 35A ఆర్టికల్ రద్దు చేసి సర్దార్ వల్లాభాయ్ పటేల్ కలను సాకారం చేశామని చెప్పారు. ఇక ఈ సారి స్వాతంత్ర్య వేడుకలు చాలా ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఎందుకంటే ఈ మధ్యే జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది.

ఇక జమ్మూ కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జెండా ఎగురవేస్తారని తెలుస్తోంది. అమిత్ షా పర్యటిస్తారనే వార్త బయటకు రావడంతో అక్కడ భారీగా బలగాలు మోహరించాయి. గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే ఉగ్రదాడులు జరుగుతాయన్న నిఘావర్గాల సమాచారంతో దేశవ్యాప్తంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఢిల్లీలోని ఎర్రకోట భద్రతా బలగాల చేతిలోకి వెళ్లిపోయింది. జెండా ఎగురవేసే పరిసర ప్రాంతాలన్నిటినీ భద్రతాబలగాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి.

Modi speech

పార్లమెంటు భవనాన్ని విద్యుద్దీపాలతో సుందరీకరించారు. జెండాఎగురవేసే కొన్ని గంటల ముందునుంచే దేశవ్యాప్తంగా సంబరాలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 7:30 గంటలకు ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు, పలువురు వీఐపీలు పాల్గొన్నారు.

Newest First Oldest First
12:47 PM, 15 Aug
ఇండోనేషియాలోని భారత ఎంబసీలో ఘనంగా జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు
12:02 PM, 15 Aug
కశ్మీర్‌లో జరుగుతున్న తంతుపై ప్రపంచదేశాలు మౌనం వహించడం బాగోలేదు. ఇలానే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు తిరగబడతారు.. హింసాత్మక వాతావరణం నెలకొంటుందని హెచ్చరించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
12:00 PM, 15 Aug
కశ్మీర్‌లో ఏం జరుగుతోంది అని ట్వీట్ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలు లేకుండా మోడీ చేశారని ఇప్పుడు అదే పరిస్థితి కశ్మీర్‌లో కనిపిస్తోందని ట్వీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్
11:36 AM, 15 Aug
తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
11:35 AM, 15 Aug
అట్టారీ వాఘా బోర్డర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీ కట్టిన మహిళలు
11:34 AM, 15 Aug
ఈ సారి కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో స్వాతంత్ర్య వేడుకలు చాలా ప్రత్యేకం. తొలిసారి యూటీలో జరుగుతున్న వేడుకల్లో భాగస్వామినవడం చాలా ఆనందంగా ఉంది:రాంమాధవ్
11:33 AM, 15 Aug
భారత్ బంగ్లా సరిహద్దుల్లో మిఠాయిలు ఒకరికొకరు పంచుకుని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్న జవాన్లు
11:32 AM, 15 Aug
ఇండో టిబెటన్ సరిహద్దుల్లో భారత జవాన్ల స్వాతంత్ర్య వేడుకలు
11:31 AM, 15 Aug
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ..హాజరైన రాహుల్ గాంధీ ఇతర సీనియర్ నాయకులు
11:27 AM, 15 Aug
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు చారిత్రాత్మకమైనదే కాదు..జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి ద్వారాలు తెరినట్లయ్యింది: గవర్నర్ సత్యపాల్ మాలిక్
11:25 AM, 15 Aug
శ్రీనరగ్‌లోని షేర్-ఈ-కశ్మీరీ స్టేడియంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన గవర్నర్ సత్యపాల్ మాలిక్
11:24 AM, 15 Aug
లడఖ్‌లోని లేహ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
11:21 AM, 15 Aug
కేరళలో పినరాయి విజయన్, తమిళనాడులో పళనిస్వామి, ఏపీలో వైయస్ జగన్‌లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు: సీఎం జగన్
11:20 AM, 15 Aug
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోడీకి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
9:13 AM, 15 Aug
ప్రధానిని చుట్టేసిన చిన్నారులు
9:12 AM, 15 Aug
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి చిన్నారులను దగ్గరకు వెళ్లి పలకరించి కరచాలనం చేసిన ప్రధాని మోడీ
9:10 AM, 15 Aug
92 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని మోడీ
9:06 AM, 15 Aug
జైహింద్ భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదంతో తన ప్రసంగాన్ని ముగించిన ప్రధాని మోడీ
9:03 AM, 15 Aug
73వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని నృత్యం చేసిన లడఖ్ ఎంపీ సేరింగ్ నమ్గ్యాల్
8:57 AM, 15 Aug
ఒక అడుగు ముందుకు వేస్తే ప్రపంచం మనలను అనుసరిస్తుంది: మోడీ
8:56 AM, 15 Aug
2020 నాటికి భారత్ పర్యాటకరంగంలో ప్రపంచదేశాల సరసన నిలుస్తుంది. అది కష్టమే అయినప్పటికీ సాధిస్తామన్న పూర్తి విశ్వాసం ఉంది. ఈశాన్య రాష్ట్రాలను టూరిస్టు డెస్టినేషన్‌గా మార్చుతాం: మోడీ
8:53 AM, 15 Aug
స్థానిక దుకాణాల్లో డబ్బులు డిజిటల్ పేమెంట్ ద్వారా చేయాలి: మోడీ
8:53 AM, 15 Aug
ప్రభుత్వం తీసుకొచ్చిన రూపే కార్డు సింగపూర్‌లో కూడా పనిచేస్తుంది. త్వరలో ఇతర దేశాల్లో కూడా చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకుంటాం
8:51 AM, 15 Aug
జనపనార నుంచి తయారయ్యే బ్యాగులను వినియోగిస్తే దేశంలోని రైతును ఆదుకున్నట్లు అవుతుంది: మోడీ
8:51 AM, 15 Aug
బట్టతో తయారు చేసిన బ్యాగులను ప్రతి పౌరుడు తీసుకెళ్లాలి..ప్లాస్టిక్ బ్యాగ్స్‌కు స్వస్తి పలకాలి: మోడీ
8:50 AM, 15 Aug
దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం లేకుండా చూడండి: మోడీ
8:50 AM, 15 Aug
ప్లాస్టిక్ వేస్టును తగ్గించేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది: మోడీ
8:46 AM, 15 Aug
త్వరలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేస్తాం...త్రివిధ దళాల్లో ఈ విభాగం సంస్కరణలు తీసుకొస్తుంది: మోడీ
8:44 AM, 15 Aug
దేశ త్రివిధ దళాలు ప్రతి పౌరుడు గర్వపడేలా చేస్తున్నాయి: మోడీ
8:43 AM, 15 Aug
అఫ్ఘానిస్తాన్ మరికొద్ది రోజుల్లో ఆదేశ స్వాతంత్ర్య దినోత్సవంను జరుపుకోనుంది. ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను: మోడీ
READ MORE

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The nation is all set to celebrate its 73rd Independence day amid tight security. Prime Minister Modi will unfurl the national flag on Redfort at around 8am.Tight security arrangements were made in Jammu and Kashmir as the news is making rounds that Amit Shah would tour in Lal Chowk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more