• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీడియా విశ్వసనీయతకు దెబ్బ - న్యూస్ చానెళ్లను వినోదంగా భావిస్తోన్న జనం - కారణాలివే..

|

ప్రజల పక్షాన నిలబడి, పీడితులకు గొంతుకగా, ప్రభుత్వానికి సవాలుగా వ్యవహరించాల్సిన మీడియా సంస్థలకు సంబంధించి ప్రేక్షకుల ఆలోచనా సరళిలో భారీ మార్పులు వచ్చాయి. గత కొంత కాలంగా.. గ్రౌండ్ లెవెల్ లో వార్తల సేకరణ కంటే, స్డుడియోలో హాట్ డిబేట్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోన్న టీవీ చానెళ్ల పట్ల జనాభిప్రాయం చాలా మారిపోయింది. ఈ ధోరణికి కరోనా లాక్ డౌన్ కూడా తోడైపోవడంతో ప్రజలు ప్రస్తుతం న్యూస్ చానెళ్లను ఎంటైర్ టైన్మెంట్ సాధనాలుగా భావించే పరిస్థితి నెలకొందిప్పుడు.

విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్

ఐఏఎన్ఎస్, సీ-ఓటర్ సర్వే..

ఐఏఎన్ఎస్, సీ-ఓటర్ సర్వే..

ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ ‘ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్(ఐఏఎన్ఎస్), ప్రముఖ అధ్యయన సంస్థ ‘సీ-ఓటర్' సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో భారతీయ న్యూస్ చానెళ్లకు సంబంధించి ఆసక్తికరమైన, షాకింగ్ అభిప్రాయాలు వెలువడ్డాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా సర్వే నిర్వహించామని, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు ఐదువేల పైచిలుకు మంది నుంచి అభిప్రాయాలను సేకరించామని, సర్వే ఫలితాల మార్జిన్ జాతీయ స్థాయిలో ప్లస్ ఆర్ మైనర్ 3 శాతం, ప్రాంతీయ స్థాయిలో ప్లస్ ఆర్ మైనస్ 5శాతం ఉంటుందని సర్వేయర్లు తెలిపారు.

రేపిస్టు రఘునందన్ రావుకు టికెటా? దుబ్బాక బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు - పార్టీ నుంచి ఫైర్

74 శాతం మంది అభిప్రాయమిదే..

74 శాతం మంది అభిప్రాయమిదే..

కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలపాటు దేశం మొత్తం ఎక్కడికక్కడే స్తంభించిపోవడం తెలిసిందే. సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్స్ సైతం పూర్తిస్థాయిలో నిలిచిపోవడంతో.. ఇళ్లకే పరిమితమైపోయిన ప్రజలకు టీవీల్లో కొత్త కంటెంట్ లభించే లేదా వీక్షించే అవకాశం లేకుండాపోయింది. దీంతో జనం పెద్ద ఎత్తున న్యూస్ చానెళ్ల వైపునకు మొగ్గుచూపారు. సర్వేలో పాల్గొన్నవారిలో 74 శాతం మంది తాము న్యూస్ చానెళ్లను అసలైన వార్తల కోసం చూడటంలేదని, కేవలం వినోదం కోసమే చూస్తున్నామని చెప్పడం గమనార్హం.

హైపర్ సోనిక్ చర్చలు..

హైపర్ సోనిక్ చర్చలు..

గత కొంత కాలంగా వార్తల రిపోర్టింగ్స్ కంటే స్డుడియో యాంకర్ల ఆధిపత్యం పెరగడం, గతంలో వార్తలను, వర్తమాన పరిస్థితులను విశ్లేషిస్తూ జరిగిన టీవీ డిబేట్లు కాస్తా ఇప్పుడు గతి తప్పడం, ఒకరిపై ఒకరు లేదా టీవీ యాంకరే అందరిపైనా చిందులేస్తూ మొత్తంగా డిబేట్ అంటేనే అదేదో రియాలిటీ షో అనుకునేంత స్థాయికి ప్రేక్షకులను చేర్చడం ఒక ఎత్తయితే, లాక్ డౌన్ కాలంలో ప్రజలు విధిలేక న్యూస్ చానెళ్లను చూడటం కూడా సర్వే ఫలితాలకు కారణాలని అధ్యయనకారులు చెబుతున్నారు.

విశ్వసనీయతకు దెబ్బ

విశ్వసనీయతకు దెబ్బ

ఐఏఎన్ఎస్, సీ-ఓటర్ సర్వేలో భాగంగా భారత్​ లో వార్తా ఛానళ్లలో న్యూస్​ కన్నా వినోదమే ఎక్కువా? అన్న ప్రశ్నకు 74 శాతం మంది అవునని, 22.5 శాతం మంది కాదని, మరో 2.6 శాతం తెలియదని సమాధానం చెప్పారు. లింగ పరంగా చూస్తే 75.1 శాతం మంది పురుషులు, 72.7 శాతం మంది మహిళలు న్యూస్ చానెళ్లను ఎంటైర్ టైన్మెంట్ గానే ఫీలవుతున్నట్లు అంగీకరించారు. కాగా, దక్షిణ భారతంలో మాత్రం కాస్త తక్కువగా (67.1శాతం మంది) మాత్రమే న్యూస్ చానెళ్లలో వార్తల కన్నా వినోదం ఎక్కువని చెప్పారు. మొత్తంగా దేశవ్యాప్తంగా వెల్లడైన అభిప్రాయాలు మీడియా విశ్వతనీయతకు దెబ్బలాంటిదని, రాబోయే రోజుల్లో చోటుచేసుకోబోయే ప్రమాదాలకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

English summary
The Covid-19 pandemic has revealed the new media landscape of India. According to the recent findings of the IANS CVoter Media Tracker, 74 per cent Indians treat news channels as a source of entertainment rather than real news. It is well known that social distancing and lockdown measures impacted the production pipeline of general entertainment channels. In the absence of “fresh” creative content, the audience has turned to reality shows like news coverage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X