• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

76వ స్వాతంత్ర్య వేడుకలు: ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. ఉద్వేగంగా మోడీ ప్రసంగం!!

|
Google Oneindia TeluguNews

75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారతదేశ స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబరాలను నిర్వహించాలని, హర్ ఘర్ తిరంగా యాత్రను చేపట్టాలని సూచించడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుండి హర్ ఘర్ తిరంగా యాత్రకు విశేషమైన స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే నేడు 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎర్రకోట లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు.

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసి సైనిక గౌరవవందనం స్వీకరించారు. ఇక జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని నలుమూలల త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి అన్న నరేంద్ర మోడీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.

త్యాగధనుల పోరాట ఫలితమే 75ఏళ్ళ స్వాతంత్ర్యం

త్యాగధనుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్ర మణి 75 ఏళ్లుగా మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మన నరేంద్ర మోడీ ఎలాంటి సమస్యలు వచ్చినా ఓటమిని అంగీకరించకుండా, పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నామని గుర్తుచేశారు.రాణి లక్ష్మీబాయి, ఝల్కారీ బాయి, చెన్నమ్మ, బెగన్ హజ్రత్ మహా వంటి భారత మహిళల బలాన్ని గుర్తు చేసుకుంటే భారతదేశం గర్వంతో నిండిపోతుందని ప్రధాని మోదీ అన్నారు.

మంగళ్ పాండే, తాంతియా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు బ్రిటిష్ పాలనకు చరమ గీతం పాడిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు అని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ అన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం ... భారతదేశ బలం ఇదే

భిన్నత్వంలో ఏకత్వం ... భారతదేశ బలం ఇదే


భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, భారత పౌరుల ఉత్సాహాన్ని ఏదీ అడ్డుకోలేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మట్టికి శక్తి ఉందని , కష్టాలకు తలవంచలేదని, ముందుకు సాగుతూనే ఉందని స్పష్టం చేశారు. భారతదేశం ఒక ఆకాంక్షాత్మక సమాజం, ఇక్కడ మార్పులు సామూహిక స్ఫూర్తితో శక్తిని పొందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

దేశంలో పేదలందరికీ సహాయం అందేలా చూడటమే తన లక్ష్యం

దేశంలో పేదలందరికీ సహాయం అందేలా చూడటమే తన లక్ష్యం


దేశంలో ప్రతి ఒక్క పేద వారికి సహాయం అందేలా చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు దేశ ప్రజలు ఎప్పుడూ పునరుత్తేజం తో ఉండటమే మన బలమని, మన సామర్థ్యం, ప్రజల చైతన్యం వల్ల ప్రపంచం మన దేశాన్ని చూసే దృష్టిలో మార్పు వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. హర ఘర్ తిరంగా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతూ ప్రజలు తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ మురిసిపోతున్నారు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

120 కోట్ల మంది ప్రజలు రాజకీయ సుస్థిరత ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నారు


గత రెండు స్వాతంత్ర్య దినోత్సవాలు కరోనా మహమ్మారి కారణంగా ఆంక్షల నడుమ జరిగాయని, ఈసారి రెట్టించిన ఉత్సాహంతో జాతి యావత్తు జెండా పండుగను ఘనంగా నిర్వహించుకుంటుంది అని మోడీ తెలిపారు. 120 కోట్ల మంది ప్రజలు రాజకీయ సుస్థిరత ఫలితాన్ని ఇప్పుడు చూస్తున్నారని పేర్కొన్న ప్రధాని మోడీ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు అంటూ పేర్కొన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఫలాలు అందరికీ అందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని యువతను కోరిన ప్రధాని


2047 వ సంవత్సరం నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని యువతను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. 2047 నాటికీ 50 ఏళ్లు నిండని యువత స్వాతంత్రం వచ్చి వందేళ్ల నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. తాను తన తొలి ప్రసంగంలో స్వచ్ఛభారత్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమం వచ్చిందని, ప్రస్తుతం భారత్ పై ఇంకా ఆశలు ఉన్నాయని, 130 కోట్ల మంది భారతీయుల నైపుణ్యమే అందుకు కారణమని ప్రధాని మోడీ వెల్లడించారు.

ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించింది భారత్


ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ ను అందించిన ఘనత భారతదేశానికి ఉందని, డిజిటల్ ఇండియా స్టార్టప్ లు మన టాలెంట్ కు ఉదాహరణగా నిలిచాయని మోడీ పేర్కొన్నారు. నరుడిలో నారాయణుడిని చూస్తే సంస్కృతి మనది అని, దేశంలోని అన్ని భాషల ను చూసి గర్వ పడాలి అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ కు మన పూర్వీకులు ఎప్పుడో పరిష్కరించి చూపించారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కూతురు, కొడుకు మధ్య భేదం చూపిస్తే సమానత్వం రాదని, మహిళలను వేధింపుల నుండి బయటపడేలా సంకల్పం తీసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు.

English summary
The 76th Independence Day celebrations are going on all over the country. After unfurling the national flag at the Red Fort, Prime Minister Modi addressed the people of the country in an emotional speech. Modi asked the youth to make India a developed country by 2047.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X