వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 బిలియన్ డాలర్లతో 8-10 రక్షణరంగ ఒప్పందాలు.., ట్రంప్-మోడీ సమావేశంలో అగ్రిమెంట్..?

|
Google Oneindia TeluguNews

రెండురోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌లో అడుగిడారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో ట్రంప్ సమావేశమవుతారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు రక్షణరంగంలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. వీటి మొత్తం విలువ 10 బిలియన్ అమెరికా డాలర్లు ఉండే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ డీల్స్ ఏంటో ఓసారి పరిశీలిద్దాం పదండి.

ట్రంప్ 36 గంటల పర్యటనతో ఒనగూరే ప్రయోజనం ఏం లేదు, ట్రంప్-మోడీపై 'సామ్నా’లో శివసేన ఫైర్ట్రంప్ 36 గంటల పర్యటనతో ఒనగూరే ప్రయోజనం ఏం లేదు, ట్రంప్-మోడీపై 'సామ్నా’లో శివసేన ఫైర్

10 వరకు రక్షణ ఒప్పందాలు..

10 వరకు రక్షణ ఒప్పందాలు..

ట్రంప్ భారతదేశ పర్యటనలో 8 నుంచి 10 రక్షణ ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. వీటి విలువ 10 బిలియన్ డాలర్ల వరకుఉంటుందని ‘సీఎన్‌బీసీ 18' నివేదించింది. అమెరికా నుంచి రోమియో హెలికాప్టర్ల ఒప్పందం జరిగే అవకాశం ఉంది. దీనిపై చర్చలు చివరి దశకు చేరాయని, ఒప్పందం విలువ 2.6 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది.

అపాచీ హెలికాప్టర్లు కూడా..

అపాచీ హెలికాప్టర్లు కూడా..

శత్రువులను వాయువేగంతో ఎదుర్కొనే అపాచీ హెలికాప్టర్లకు సంబంధించి కూడా డీల్ జరగనుంది. ఆరు అపాచీ హెలికాప్లర్ల కోసం 795 మిలియన్ డాలర్లతో అగ్రిమెంట్ చేసుకొంటారని తెలుస్తోంది. దీంతోపాటు 3.6 బిలియన్ల డాలర్లతో నాసామ్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పీబీఐ లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాప్ట్‌కి సంబంధించి డీల్ కూడా జరగబోతోంది. మరిన్ని ఎఫ్ 21 ఫైటర్లను అమెరికా అందజేసే ఆస్కారం ఉంది.

నాటో పరిధి దాటి..

నాటో పరిధి దాటి..

భారత్‌కు సాయుధ డ్రోన్లను అమెరికా అందజేసిందని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి టిమ్ రోమెర్ గుర్తుచేశారు. ఇప్పటివరకు ‘నాటో' పరిధిలో గల దేశాలకు మాత్రమే అమెరికా అందజేసిందని గుర్తుచేశారు. కానీ తొలిసారి ఇండియాకు ఇవ్వడంతో భారత్‌ను అమెరికా బలమైన రక్షణ భాగస్వామి అనుకోవడమేనని గుర్తుచేశారు. అంతేకాదు ఆసియా సైనిక వ్యయం క్రమంగా పెరుగుతోందని.. అమెరికా, యూరప్‌ను మించిందని గుర్తుచేశారు. ఈ క్రమంలో భారతదేశం సురక్షితంగా ఉండాలని అమెరికా ఆకాంక్షిస్తోందని తెలిపారు.

సైనిక విన్యాసాలు..

సైనిక విన్యాసాలు..

ఇతర దేశాల కన్నా అమెరికా-భారత్ ఎక్కువగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. వీటిలో యుధ్ అభ్యాస్, కోప్-ఇండియా, మలబార్ వంటివి ఉన్నాయి. ఇరుదేశాలు ఇటీవల టైగర్ ట్రయంప్ అనే మొదటి ట్రై సర్వీస్ సైనిక విన్యాసం కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

English summary
america president donald trump visit india to 8 to 10 big-ticket defence deals will be negotiated by the two country leaders, worth $10 billion, CNBC TV18 report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X