వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, మంటల్లో 8 మంది సజీవ దహనం

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో గల ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఫల్గర్ జిల్లా బైసోర్‌లో ఉన్న ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. బైసోర్ ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పేలుడు జరిగిన ఫ్యాక్టరీకి సమీపంలో ఆంక్ ఫార్మా అనే కంపెనీ నిర్మాణం జరుగుతోంది. దీనిని మహారాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. కోల్వాడే గ్రామంలో నిర్మిస్తోంది.

8 dead in huge explosion at chemical factory in Boisar

శనివారం రాత్రి 7.20 గంటలకు రసాయనాలను పరీక్షించే సమయంలో పేలుడు జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో పేలుడు ప్రభావం ఎక్కువగా ఉంది. 15 కిలోమీటర్ల పరిధి ప్రాంతంలో పేలుడు ప్రభావం చూపించింది. ఫ్యాక్టరీ సమీపంలోని ఇళ్లలోని కిటికీలు పగిలిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.

కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. గాయపడ్డవారిని సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు సంబంధించి మంటలు చెలరేగాయని అధికారులు పేర్కొన్నారు. ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని, మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
Eight people have been killed in an explosion at a chemical factory in Maharashtra's Palghar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X