వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు, టూ వీలర్లపై విరిగిపడ్డ కొండచరియలు.. 8 మంది మృతి, పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లా చాండీ కా దార్‌లో రహదారిపై పడ్డాయి. దీంతో అటు నుంచి వస్తోన్న మూడు వాహనాదారులపై పడిపోయింది. వీటిలో ఓ కారు, రెండు ద్వి చక్ర వాహనాలు ఉన్నాయి. కొండచరియలు విరిగిపడటంతో 8 మంది చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. పలువురు గాయపడ్డారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో వాహనాలపై పడ్డ కొండచరియలు, 50 మంది మృతిహిమాచల్‌ప్రదేశ్‌లో వాహనాలపై పడ్డ కొండచరియలు, 50 మంది మృతి

శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. రాత్రి ముగ్గురు చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. క్షతగాత్రుల్లో మరో ఐదుగురు చనిపోయారని ఆదివారం ఉదయం అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో అక్కడ మట్టిపెళ్లలతో నిండిపోయింది. గాయపడ్డ వారి నెత్తుటితో అక్కడ భీతావాహ పరిస్థితి నెలకొంది.

8 killed after landslide hits 3 vehicles in Uttarakhand

కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తోండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే వాహనాల్లో ఎంత మంది ఉన్నారనే అంశంపై క్లారిటీ లేదని జిల్లా కలెక్టర్ మంగేశ్ గిల్దియాల్ పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ పేరుతో ఉందని తెలిపారు. మృతులంతా ఢిల్లీకి చెందిన వారు అని చెప్పారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్‌తో విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. మృతులను గుర్తించి.. బంధువులకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

English summary
eight people were killed after three vehicles, including two motorcycles and a car, were hit by a landslide in Uttarakhand’s Rudraprayag district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X