వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది మావోయిస్టుల హతం..

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో పోలీసులు-మావోయిస్టుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తొండమార్కా, బడేకదేవాల్ అటవీప్రాంతాల్లో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే ఇరువర్గాలు కాల్పులు ప్రారంభించాయి. కసాల్పవాడు అటవీప్రాంతంలో కూడా భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.

అటవీప్రాంతంలో భద్రతా దళాలు దాదాపు 30 గంటలపాటు ఆపరేషన్ ప్రహార్ చేపట్టాయి. మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు నెలకొరిగారు. మరికొందరు గాయపడ్డారు.

8 Maoists killed in encounter on Chhattisgarh

Recommended Video

'Namaste Trump' : Ahmedabad’s Motera Stadium Getting Ready To Host Trump | Oneindia Telugu

ఘటనాస్థలంలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు, బుల్లెట్లు, గ్రనేడ్లు విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కి ఉన్నారనే సమాచారం మేరక పోలీసులు ఆఫరేషన్ ప్రహార్ చేపట్టారు. ఒక రోజుకుపైగా గాలించడంతో.. చివరికి వారి ఆచూకీ తెలిసింది. భద్రతా దళాలను చూసి మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. తాము ఫైర్ స్టార్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు.

English summary
8 Maoists killed in encounter on Chhattisgarh sukma district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X