• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీ సాయం ఆ బాబు చివరి సర్జరీ పూర్తయ్యేలా చేస్తుంది: ఒక నిండు ప్రాణాన్ని నిలబడుతుంది

By Srinivas
|

"అనిరుధ్ మా ఒక్కగానొక్క బిడ్డ. మా ఇంట్లో అన్నీ లెక్కలేసి ఖర్చు చేసేవారు. కానీ నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నాకింకా గుర్తే. నా భర్త ఇల్లంతా పుట్టబోయే బేబీ కోసం చాలా డ్రెస్‌లు కొన్నాడు. గోడల నిండా బేబీ ఫొటోలతో నింపేశాడు. మా ఆయనతో పాటు మా కుటుంబ సభ్యులం అంతా మాకు పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూశాం. మొత్తానికి మాకు బాబు పుట్టాడు. మా ఇంట్లో బేబీ ఫోటోలు చూస్తున్నప్పుడు అనిరుధ్ అనే పేరు చదివినట్లు నాకు గుర్తు. నా బాబు కూడా ఆ ఫోటోలో బేబీలా ఉన్నట్టు అనిపించింది. అందుకనే మా బాబుకి అనిరుధ్ అని పేరుపెట్టాం." అంటూ అనిరుధ్ తల్లి చెప్పింది.

అయితే అనిరుధ్ తల్లి ప్రసవ సమయానికన్నా ముందే డెలివరీ అయ్యింది. ప్రీమెచ్యూర్ డెలివరీలలో ఉండే సమస్యలను ఆమె భరిస్తోంది. డాక్టర్లు అనిరుధ్‌కు పేగులు సరిగా ఏర్పడలేదని చెప్పారు. దాంతో బాబు మలవిసర్జన నొప్పి, రక్తస్రావం లేకుండా చేయలేడని అన్నారు. అనిరుధ్ కు ఇప్పుడు వెంటనే మూడు దశల కోలోస్టమీ ఆపరేషన్ అవసరం.

8 Month Old Anirudh Seeks Your Help For His Final Surgery

అనిరుధ్ తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ.15,000. ఆ ఆదాయంతో అనిరుధ్ తల్లిదండ్రులకి అతని మందులను భరించటమే కష్టంగా ఉంది. మూడు సర్జరీలంటే దాదాపు అసాధ్యంగా కన్పిస్తోంది. కానీ అలా చేయకుంటే బాబు ప్రాణానికే ప్రమాదం కాబట్టి వారు ఏ అవకాశం వదులుకోవట్లేదు. 2,50,000 రూపాయల అప్పు తీసుకున్నారు. వడ్డీ సరిగా కట్టలేకపోతున్నారు. మొదటి ఆపరేషన్ విజయవంతమైంది. డాక్టర్లకి మిగతా రెండూ కూడా విజయవంతమవుతాయనే నమ్మకం పెరిగింది. కానీ ఆర్థికంగా నలిగిపోతున్నారు అనిరుధ్ తల్లిదండ్రులు.

"మా బాబు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. రోజూ వాణ్ని ఐసియూలో ట్యూబులతో ఉంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. మా వాడు మలవిసర్జన చేసినప్పుడల్లా వాడు గుక్కపట్టి ఏడ్చుతున్నాడు. ఆ ఏడుపు ఇంకా నా చెవుల్లో గింగురుమంటుంది. వాడి చెయ్యి పట్టుకుని ఇంకాస్త ఓర్చుకోమని ప్రార్థించేదాన్ని. నా అనిరుధ్‌ని నొప్పి లేకుండా చూడాలని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా.

8 Month Old Anirudh Seeks Your Help For His Final Surgery

ఏదో ఒకరకంగా వాడికి సాయం అందాలనే కోరుకుంటున్నాను. నా బిడ్డ పక్కనున్నప్పుడల్లా, వాడికి సాయం తన దగ్గరకి వెతుక్కుంటూ వస్తోందని, బాధపడొద్దని ఓదార్చుతున్నాను. వాడికి అర్థం చేసుకునే వయస్సు ఉండకపోవొచ్చు గానీ రేపు పెద్దగయ్యాక సాయం చేసిన మీ అందరినీ దేవుళ్ల మాదిరగానే పూజిస్తాడు. నువ్వు తిరిగి మామూలు వాడివయ్యి రంగురంగుల ఆశలతో నిండిన ప్రపంచాన్ని చూస్తావు కన్నా అంటూ వాణ్ని ఓదార్చుకుంటూ ఉంటాను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అనిరుధ్ తల్లి.

అనిరుధ్‌కు రెండో సర్జరీ క్రౌడ్ ఫండ్‌తో జరిగింది. ఆ సాయాన్ని చూసి ఆ కుటుంబం కన్నీళ్ల పర్యంతమైంది. సాయం చేసిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు తెలిపారు. అన్ని రకాల గ్రూపులు, దగ్గరవారు, దూరంవారు అందరూ అనిరుధ్‌ను కాపాడటానికి ఒక్కటయ్యారు. ఆ తల్లితో ఆశ మళ్ళీ చిగురించింది. కాస్త కోలుకున్న తన బాబును చూసుకుని సంతోషించింది.

కానీ అనిరుధ్‌కు మరో ఆఖరి సర్జరీ కూడా అవసరం. అదే మూడో ఆపరేషన్. మొదటి రెండు విజయవంతమైన ఆపరేషన్ల వల్ల అనిరుధ్ తన తీవ్రస్థితి నుంచి బయటపడ్డాడు. డాక్టర్లు అతను ఇప్పుడు ఆఖరి సర్జరీకి తయారని చెప్పారు. దీనితో బాబు పూర్తిగా కోలుకుంటాడు. అనిరుధ్ జీవితం తనకు అందివ్వడానికి ఆ కుటుంబానికి ఇదే ఆఖరి అవకాశం. ఈ కుటుంబం ఫండ్ రైజర్ కోసం 'ఇంపాక్ట్ గురు'ను ఆశ్రయించింది.

8 Month Old Anirudh Seeks Your Help For His Final Surgery

ఇది ఆ బాబుకి మామూలు ఆరోగ్యమైన జీవితం అందించటానికి ఆఖరి అవకాశం కావొచ్చు కానీ మీ సాయం లేకుండా అది అసాధ్యం. ఆ బాబు ఇప్పటికే నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నాడు. అనిరుధ్ కుటుంబం తమ బిడ్డ సర్జరీ కోసం మీ నుంచి చిన్న సాయాన్ని కోరుతున్నారు. మీరు ఎంతో కొంత మొత్తం ఇచ్చి అనిరుధ్ జీవితంలో వెలుగులు నింపండి. మీ తరఫు నుంచి వచ్చే కొద్ది మొత్తంలోని సాయం కూడా ఆ కుటుంబంలో ఆనందాన్ని పంచుతుంది.

అనిరుధ్ తల్లి మాట్లాడుతూ "మా బాబుని కాపాడి వాడి జీవితంలో ఆశాజ్యోతి అవ్వండి. మేము మా బాబు ప్రాణం కాపాడటానికి మీరు చేసిన సాయానికి జీవితాంతంరుణపడివుంటాం." అని అన్నారు. మీరు అనిరుధ్‌కు విరాళంగానీ, లేదంటే ఈ దీనగాథను మరొకరికి షేర్ చేసినా అయినా సరే ఆ బాబును కాపాడండి. అనిరుధ్‌ను అందరం కలిసి కాపాడుకుందాం, మానవత్వం దయ విస్తరించేలా ప్రయత్నిద్దాం.

అనిరుధ్‌కు విరాళం

English summary
"Anirudh is our only child. I remember when I was pregnant with him, my practical and economical husband filled our little house with baby clothes and decorated the walls with baby photos. We waited for the arrival of Anirudh. We never really thought of this name. While going through a baby's photo I remember reading the name, Anirudh. I wanted my baby to look like the one in the photo. So, we named our child Anirudh," says Anirudh's mother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more