వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ ఆవరణలోనే 8 మంది ఎంపీల నిరసన: సమీపంలో అంబులెన్స్,..

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపే క్రమంలో ఆందోళన చేపట్టిన 8 మంది సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు పార్లమెంట్ ఆవరణలో అర్ధరాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన కొనసాగుతోంది. వారిని అక్కడినుంచి పంపించేందుకు గార్డులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీవ్, సయ్యద్ నాజీర్ హుస్సేన్, రిపూన్ బోర, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, సీపీఎం నుంచి కేకే రగేశ్, ఎలమరన్ కరీం, సింగ్, ఆప్ నుంచి సంజయ్ సింగ్ ఉన్నారు.

 నిరసన..

నిరసన..

ఆదివారం సభ ముందుకు వివాదాస్పద వ్యవసాయ బిల్లు వచ్చింది. అయితే సరైన విధానంలో బిల్లు తీసుకురాలేదని సభ్యులు నిరసన తెలిపారు. వెల్ లోకి దూసుకొచ్చి పేపర్లు చించేశారు. టేబుళ్లను తోసి.. నినాదాలు చేశారు. రూల్ బుక్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై విసిరేశారు. అయితే సభలో జరిగిన దుమారంపై.. చైర్మన్ వెంకయ్యనాయుడు లేఖ రాశారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. దీంతో 8 మందిని వారం రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీనిని నిరసిస్తూ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేస్తున్నారు.

పార్లమెంట్ ఆవరణలో ఆందోళన

పార్లమెంట్ ఆవరణలో ఆందోళన

అక్కడే బ్లాంకెట్, పిల్లోలు తీసుకొచ్చి కూర్చొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహాం వద్ద పాటలు పాడుతూ నిరసన తెలుపుతున్నారు. తమను సస్పెండ్ చేయడంతో నోరు మూసే ప్రయత్నం చేయాలని అనుకొంటున్నారని విరుచుకుపడ్డారు. తాము రైతుల పక్షాన పోరాడుతామని తేల్చిచెప్పారు. కానీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పార్లమెంటరీ విధానాలను తుంగలో తొక్కారని సీపీఎం ఎంపీ కరీం విమర్శించారు. అయితే నిరసన తెలుపుతున్న ఎంపీలు తాము ఉన్న ప్రాంగణం వద్ద ఒక అంబులెన్స్.. కావాల్సిన మంచినీరు ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది.

Recommended Video

Rajya Sabha Passes 2 Agriculture Bills వ్యవసాయమంతా కార్పొరేట్ల చేతిలోకి : కాంగ్రెస్ || Oneindia
సాగని సభ..

సాగని సభ..

ఆదివారం బిల్లుల ఆమోదంతో చెలరేగిన రగడ సోమవారం కూడా కొనసాగింది. సోమవారం సభలో ఒక అంశంపై కూడా చర్చించలేదు. జీరో అవర్‌లో కొన్ని అంశాలను లేవనెత్తుదామని ప్రయత్నించిన.. సభ్యుల నిరసనలతో సభ సజావుగా సాగలేదు.

English summary
eight MPs sit-in inside Parliament complex for against farm bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X