• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రామ్ గోపాల్ వర్మ సినిమాలు వేస్ట్, రక్తచరిత్ర స్టైల్లో జైల్లో వికాస్ దూబే స్కెచ్ లు, బంధువులు ఫినిష్

|

లక్నో/ కాన్పూర్ / న్యూఢిల్లీ: మంత్రితో పాటు రాజకీయ నాయకులు, ప్రత్యర్థులను అతి దారుణంగా చంపేస్తూ వచ్చిన పేరుపొందిన మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ఇప్పుడు పోలీసు అధికారులు, పోలీసులను అతిదారుణంగా కాల్చిచంపి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. వికాస్ దూబే పేరు చెబితో ఉత్తరప్రదేశ్ లో చాలా మంది హడలిపోతున్నారు. రామ్ గోపాల్ వర్మా సినిమాల్లో హీరోలు, విలన్లను ఎలా స్కెచ్ లు వేసి ప్రత్యర్థులను అంతం చేస్తారో అంతకన్నా పక్కాప్లాన్ తో వికాస్ దూబే శుక్రవారం నలుగురు పోలీసు అధికారులు, నలుగురు పోలీసులను అతిదారుణంగా హత్య చేసి వారి తుపాకులు ఎత్తుకెళ్లిపోయారు. ఇంతకి ఉత్తరప్రదేశ్ లో కరుడుకట్టిన రౌడీషీటర్ వికాస్ దూబే ఎవరు ? వాడి నేర చరిత్ర ఏమిటి ?, జైల్లోనే స్కెచ్ లు వేసి బంధువులను ఎలా లేపేశాడు అని ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు చర్చించుకుంటున్నారు. కరుడుకట్టిన నేరస్తుడు వికాస్ దూబే నేర చరిత్ర ఎలా ఉందో మీరే చూడండి.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 గ్యాంగ్ లీడర్లకే అమ్మా మొగుడు

గ్యాంగ్ లీడర్లకే అమ్మా మొగుడు

హత్యలు, దోపిడీలు, లూటీలు, రేప్ లు, కిరాయి హత్యలతో పాటు ప్రత్యర్థులను అతికిరాతకంగా చంపేసిన వికాస్ దూబే మీద 65కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అనేక కేసుల్లో జైలుకు వెళ్లిన వికాస్ దూబే జైలు నుంచి ఉత్తరప్రదేశ్ లోని శివరాజ్ పుర పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తన రౌడి సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకున్నాడు. గ్యాంగ్ లీడర్లకు అమ్మా మొగుడు అయిన వికాస్ దూబే ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయాడు.

 బీజేపీ మంత్రిని లేపేసినా దిక్కులేదు

బీజేపీ మంత్రిని లేపేసినా దిక్కులేదు

2001లో ఉత్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు, అప్పటి ఆ రాష్ట్ర మంత్రి అయిన సంతోష్ శుక్లాను అతిదారుణంగా హత్య చేసిన వికాస్ దూబే పేరు ఉత్తరప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా మారుమోగింది. అధికారంలో మంత్రి పదవిలో ఉన్న సంతోష్ శుక్లాను అతిదారుణంగా హత్య చేసిన వికాస్ దూబేని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే వికాస్ దూబే కిరాతకుడు కావడంతో మంత్రి సంతోష్ శుక్లాకు అనుకూలంగా ఎవ్వరూ సాక్షం చెప్పకపోవడం, మంత్రిని వికాస్ దూబేనే హత్య చేశాడని సరైన సాక్షాలు లేకపోవడంతో అతను సెషన్స్ న్యాయాలయంలో నిర్దోషిగా బయటకు వచ్చాడు.

 విద్యాసంస్థల్లో దందాలు, హత్యలు

విద్యాసంస్థల్లో దందాలు, హత్యలు

ఉత్తరప్రదేశ్ లో అప్పటి బీజేపీ మంత్రి సంతోష్ శుక్లాను హత్య చెయ్యకముందే విద్యాసంస్థల్లో దందాలు చేసిన వికాస్ దూబే సెటిల్ మెంట్లు చేసేవాడు. 2000వ సంవత్సరంలో ధారచంద్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆ కాలేజ్ మేనేజర్ తనకు మామూళ్లు ఇవ్వలేదని, తాను చెప్పిన మాట వినలేదని ఆరోపిస్తూ ఇద్దరిని అతి కిరాతకంగా చంపేశాడు. శుక్రవారం పోలీసు అధికారులు కాల్చి చంపిన ప్రాంతంలోనే కాలేజ్ ప్రిన్సిపల్, మేనేజర్ హత్యకు గురికావడం విశేషం.

ఎదురు తిరిగిన బంధువులు హత్య

ఎదురు తిరిగిన బంధువులు హత్య

వికాస్ దూబే కిరాయి హత్యలే కాదు, తనకు ఎదురు తిరిగిన ఎవ్వరినీ వదిలిపెట్లలేదు. తన అగడాలకు అడ్డు వస్తున్నాడని, తనకే పోటీగా గ్యాంగులు తయారు చేస్తున్నాడని పసిగట్టిన వికాస్ దూబే 2018లో సమీప బంధువు అయిన అనురాగ్ పత్నితో పాటు అతని ముఖ్య అనుచరులైన నలుగురిని అతి దారుణంగా చంపేశాడు. ఈ హత్యలు కూడా శుక్రవారం పోలీసులు హత్యకు గురైర పరిసర ప్రాంతాల్లోనే జరిగాయి.

 రక్తచరిత్ర స్టైల్లో జైల్లోనే దందాలు

రక్తచరిత్ర స్టైల్లో జైల్లోనే దందాలు

2000లో ప్రముఖ రాజకీయ నాయకుడు రామ్ బాబు యాదవ్ హత్య కేసులో వికాస్ దూబే జైలుకు వెళ్లాడు. 2004లో జైల్లో ఉన్న వికాస్ దూబే తన సమీప బంధువు, కిరాయి హత్యలకు పోటీగా వస్తున్న సమీప బంధువు దినేష్ దూబేని జైలు నుంచి చంపించిన వికాస్ దూబే తనకు ఎవరైనా ఎదురు వస్తే ఇదే గతి పడుతుందని ప్రత్యర్థులను హెచ్చరించాడు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా వికాస్ దూబే అగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఉత్రప్రదేశ్ ను గడగడలాడిస్తున్న వికాస్ దూబే తనను పట్టుకోవడానికి వచ్చిన నలుగురు పోలీసు అధికారులతో పాటు మరో నలుగురు పోలీసులను అతిదారుణంగా కాల్చి చంపేశాడు.

  Priyanka Gandhi Set To Shift to Lucknow || Oneindia Telugu
  రూ. కోటి రూపాయలు పరిహారం

  రూ. కోటి రూపాయలు పరిహారం

  కిరాతకుడు వికాస్ దూబే, అతని గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో శుక్రవారం మరణించిన పోలీసులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ లో నివాళులు అర్పించారు. రౌడీషీటర్ల కాల్పుల్లో మరణించిన పోలీసు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక్క కోటి రూపాయల పరిహారంతో పాటు వారి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. వికాస్ దూబేతో పాటు అతని అనుచరులు ఎవ్వరినీ వదిలిపెట్టమని, చట్టపరంగా అందరిని కఠినంగా శిక్షిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ గూండారాజ్ వికాస్ దూబేని, అతని అనుచరులను హెచ్చరించారు.

  English summary
  Uttar Pradesh: 8 police personnel including a DSP have been shot by criminals at Kanpur, Know about noted rowdy sheeter Vikas Dubey.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more