• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యవసాయ బిల్లులపై రగడ - సస్పెండైన రాజ్యసభ ఎంపీల నిరవధిక దీక్ష - ఏకమైన విపక్షాలు

|

వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రగడ రోజురోజుకూ పెద్దదవుతున్నది. ఓవైపు రోడ్లపై లక్షల మంది రైతులు ఆందోళనలకు దిగగా.. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలు సైతం నిరసనలు చేపట్టారు. రాజ్యసభలో ఎన్టీఏకు మెజార్టీ లేకపోయినా.. అప్రజాస్వామికంగా బిల్లుల్ని పాస్ చేయించుకున్నారని విపక్షం మండిపడింది. ఆదివారం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై చైర్మన్ తీవ్ర చర్యలకు దిగారు. మొత్తం ఎనిమిది మంది ఎంపీలకు ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. దీంతో..

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి - ప్రభుత్వానికి కుటుంబీకుల విజ్ఞప్తి

పార్లమెంట్ లోనే నిరవధిక దీక్ష

పార్లమెంట్ లోనే నిరవధిక దీక్ష

రాజ్యసభ నుంచి సోమవారం సస్పెన్షన్‌కు గురైన 8 మంది ఎంపీలు పార్లమెంటు ఆవరణలోనే నిరవధిక నిరసన కొనసాగిస్తామని సంచలన ప్రకటన చేశారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్, డోలా సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్, రిపున్ బోరా, సైయద్ నసీర్ హుస్సేన్, సీపీఎం ఎంపీ కేకే రాగేష్, ఎలమారం కరీంలపై రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు.. వారం రోజుల పాటు బహిష్కరణ వేటు వేశారు. రైతుల తరఫున మాట్లాడుతోన్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నదని, బిల్లులు వెనక్కి తీసుకునేదాకా తాము నిరసన కొనసాగిస్తామని ఎంపీలు చెప్పారు.

హ్యాట్సాఫ్ వరుణ్..పీకల్లోతు నీళ్లలో 10ఏళ్ల బాలుడి నిరసన -అందరినీ కదిలించాడు -రైతులంటే సినిమా షో కాదు

ఏకమైన విపక్షాలు..

ఏకమైన విపక్షాలు..

రాజ్యసభలో సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరవధిక దీక్షకు దిగిన తర్వాత విపక్షాలు ఏకమై, వారికి సంఘీభావం ప్రకటించాయి. పలు పార్టీల నేతలు.. దీక్ష చేస్తోన్న ఎంపీలను కలిసి సంఘీభావం తెలిపారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు.. కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన ఎంపీలను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీఆర్ఎస్ సహా పలు పార్టీల నేతలు ఎంపీలకు మద్దతు పలికారు.

  Rajya Sabha Passes 2 Agriculture Bills వ్యవసాయమంతా కార్పొరేట్ల చేతిలోకి : కాంగ్రెస్ || Oneindia
  మ్యూటింగ్ ఆఫ్ డెమోక్రసీ..

  మ్యూటింగ్ ఆఫ్ డెమోక్రసీ..

  వ్యవసాయ బిల్లుల విషయంలో పార్లమెంట్ సాక్షిగా మోదీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని, "మ్యూటింగ్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా" విధానాన్ని బీజేపీ అనుసరిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. కనీసం రైతుల గోడు వినకుండా రూపొందించిన వ్యవసాయ బిల్లుల్ని నల్ల చట్టాలుగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న అంతులేని అహంకారం వల్లే దేశానికి ఆర్థిక విపత్తు వచ్చిపడిందని రాహుల్ విమర్శించారు.

  English summary
  Thousands of farmers in Punjab, Haryana as well as other states have hit the streets in protest against the farm bills passed by the government. protest against the farm bills also reached Parliament as Rajya Sabha Opposition MPs are staging a sit-in outside Parliament over the contentious legislation and the drama that unfolded over its passing on Sunday in the Rajya Sabha. 8 Rajya Sabha MPs suspended till end of session, MPs sit on indefinite strike
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X