వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8మంది సిమి ఉగ్రవాదుల హతం: ఇలా దొరికిపోయారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

భోపాల్: ఆదివారం అర్ధరాత్రి రాత్రి రెండు గంటల సమయంలో జైల్ గార్డ్ రామ్ కుమార్‌ను దారుణంగా హత్య చేసి పారిపోయిన 8మంది సిమీ ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలన్న పోలీసుల దృఢ నిశ్చయం భోపాల్ నగరాన్ని, చుట్టు పక్కల ప్రాంతాలనూ దిగ్బంధం చేయగా.. ఈ 8మందీ పోలీసుల కళ్లు గప్పి ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు.

గార్డు హత్య: జైలు నుంచి పరారైనగంటల్లోనే 8మంది ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లో హతం

అర్ధరాత్రి గార్డును చంపి..

అర్ధరాత్రి గార్డును చంపి..

ఆదివారం అర్ధరాత్రి రాత్రి రెండు గంటల సమయంలో జైల్ గార్డ్ రామ్ కుమార్‌ను దారుణంగా హత్య చేసి పారిపోయిన 8మంది సిమీ ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారు.

వేట మొదలు

వేట మొదలు

ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలన్న పోలీసుల దృఢ నిశ్చయం భోపాల్ నగరాన్ని, చుట్టు పక్కల ప్రాంతాలనూ దిగ్బంధం చేయగా.. ఈ 8మందీ పోలీసుల కళ్లు గప్పి ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు.

8గంటల్లోనే..

8గంటల్లోనే..

పారిపోయిన తర్వాత అందరూ విడిపోకుండా.. ఒకే గ్రూప్‌గా కలసి వుండటంతో కేవలం 8 గంటల వ్యవధిలోనే వారు దొరికిపోయారు. రాత్రి 2 గంటలకు జైలు నుంచి పారిపోయిన వారిని ఉదయం 10 గంటల సమయంలో పోలీసులు గుర్తించారు.

లొంగిపోవాలన్నా..

లొంగిపోవాలన్నా..

భోపాల్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఐంతకేడీ గ్రామ సమీపంలో వీరిని గుర్తించారు. తమకు లొంగిపోవలసిందిగా పోలీసులు వారిని కోరినప్పటికీ.. వారు వినిపించుకోలేదు.

హతమయ్యారు

హతమయ్యారు

పోలీసులపై దాడి చేసి అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు కాల్పులు జరపక తప్పలేదదు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 8మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఓ పోలీసు అధికారి వివరించారు.

హైలర్ట్

హైలర్ట్

గార్డును చంపి భోపాల్ జైలు నుంచి 8మంది ఉగ్రవాదులు పరారైన నేప‌థ్యంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఎన్‌కౌంట‌ర్‌పై స్పందించిన ఆ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్.. ఉగ్ర‌వాదులు జైలు నుంచి త‌ప్పించుకొని పారిపోడం ఒక తీవ్ర‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతోనే ఉగ్ర‌వాదుల జాడ క‌నిపెట్టి పోలీసులు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టార‌ని ఆయ‌న తెలిపారు.

సిమీ ఉగ్ర‌వాదుల ఆచూకీని స్థానికులే తెలిపారు

సిమీ ఉగ్ర‌వాదుల ఆచూకీని స్థానికులే తెలిపారు

జైలు నుంచి తప్పించుకుని ఎన్‌కౌంటర్‌లో హతమైన వారిలో అహ్మదాబాద్‌కు చెందిన ముజీబ్ షేక్, మధ్యప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ మజీద్, షోలాపూర్ కు చెందిన మహ్మద్ ఖాలీద్ అహ్మద్, మహ్మద్ సాలిక్ అలియాస్ సల్లూ, అమ్జాద్, జకీర్ హుస్సేన్ సాదిక్, అకీల్, మహబూబ్ గుడ్డూలు తప్పించుకున్నారని మధ్యప్రదేశ్ ఐజీ యోగేష్ చౌదరి ఉన్నారు.

సస్పెండ్ చేశారు

సస్పెండ్ చేశారు

కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి 8మంది ఉగ్రవాదుల పరారీకి కారణమైన ఐదుగురు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉగ్రవాదులు బయటికి వచ్చేందుకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

English summary
It took only eight hours for the Madhya Pradesh police and its Anti-Terrorist squad (ATS) to chase and kill the eight Student Islamic Movement of India (SIMI) terrorists after they broke out of Bhopal Central Jail+ early this morning, having killed a head constable and scaling the walls of the 'high-security' premises using prison bed sheets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X