వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ, ఏపీ సహా ఈ 8 రాష్ట్రాల్లోనే 85శాతం కరోనా కేసులు, 87 శాతం మరణాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటగా, మరణాల సంఖ్య 15వేలు దాటింది. ఈ పరిస్థితుల్లో దేశంలో కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఉన్నతాధికారుల ప్రత్యేక బృందం సమావేశమైంది. కరోనా కట్టడి చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ 8 రాష్ట్రాల్లోనే 85 శాతం కరోనా కేసులు, 87 శాతం మరణాలు

ఈ 8 రాష్ట్రాల్లోనే 85 శాతం కరోనా కేసులు, 87 శాతం మరణాలు

దేశం మొత్తం యాక్టివ్ కేసుల్లో 85.5శాతం.. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 87 శాతం కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు వెల్లడించారు. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1.53లక్షల కేసులు, 7106 మరణాలు నమోదు కాగా, ఢిల్లీలో 77,240 కేసులు, 2492 మరణాలు సంభవించాయి. తమిళనాడులో 74,622 కేసులు, 957 మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ మూడు ముందువరుసలో ఉన్నాయి. ఇక గుజరాత్ రాష్ట్రంలో 30వేలు కేసులు, 1772 మరణాలు, యూపీలో 20వేలకుపైగా కేసులు , 630 మరణాలు నమోదయ్యాయి.

దేశంలో భారీగా పెరుగుతున్న రికవరీ రేటు

దేశంలో భారీగా పెరుగుతున్న రికవరీ రేటు


దేశంలో ఇప్పటి వరకు 2,95,881 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 58 శాతానికిపైగా నమోదైందని వైద్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 16,685 మంది మరణించారు. దీంతో మరణాలు రేటు 3 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1.98 లక్ష యాక్టివ్ కేసులున్నాయి.

తెలంగాణ సహా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

తెలంగాణ సహా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు


రాష్ట్రాలకు సాంకేతికంగా సహాయం అందించేందుకు వైద్య, అంటువ్యాధుల నిపుణులు, ఇతర ప్రత్యేక అధికారులతో కూడిన 15 బృందాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు కేంద్రం అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే ఓ కేంద్ర బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రాల్లో పర్యటిస్తోంది. కాగా, గత 24 గంటల్లో 2,20,479 నమూనాలు సేకరించి పరీక్షించినట్లు ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ భార్గవ తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 79,96,707 నమూనాలను పరీక్షించిన్లు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 1026 డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తుండగా, వీటిలో 741 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా, మిగితా 285 ల్యాబ్‌లు ప్రైవేటువని వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పూరీ, అశ్వనీకుమార్ చౌబీ హాజరయ్యారు.

English summary
While the number of coronavirus cases in India has crossed the 5 lakh-mark and is rising every day, these cases are largely concentrated in just eight states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X