వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ కే నగర్ లో రూ. 80 కోట్లు పంచేశారు: మొత్తం లెక్కలేస్తే, ఆ వీడియోనే !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ తన అనుచరుల సహాయంతో ఇప్పటి వరకు రూ. 80 కోట్ల వరకు ఓటర్లకు డబ్బు పంచిపెట్టారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత ప్రాతినిథ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ లో జరుగుతున్న ఉప ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా ఆర్ కే నగర్ నియోజక వర్గం సొంతం చేసుకోవడానికి అందరూ చాల గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో డబ్బులు వరదలా పొంగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు రూ. 80 కోట్లకు పైగా డబ్బును ఓటర్లకు పంచిపెట్టారని అధికారులు విచారణలో వెలుగు చూసింది.

రంగంలో హై ప్రొఫైల్ నాయకులు

రంగంలో హై ప్రొఫైల్ నాయకులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం క్యాంపు నుంచి మధుసూదనన్, శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్, జయలలిత మేనకోడలు దీపా తో సహ డీఎంకే, బీజేపీ, డీఎండీకే పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇలా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో హై ప్రొఫైల్ నాయకులు బరిలో ఉన్నారు.

దినకరన్ వర్గీయులే అధిక మొత్తంలో

దినకరన్ వర్గీయులే అధిక మొత్తంలో

శశికళ వర్గం నుంచి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ తన వర్గీయులతో భారీగానే ఓటర్లకు డబ్బు పంపిణి చేయించారని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. కేవలం దినకరన్ అనుచరులు ఆర్ కే నగర్ లో ఇప్పటి వరకు రూ. 80 కోట్లకు పైగా నగదు రూపంలో ఓటర్లకు పంపిణి చేశారని అధికారులు చెబుతున్నారు.

రూ. 200 నుంచి రూ. 300 కోట్లు ఇచ్చారంట ?

రూ. 200 నుంచి రూ. 300 కోట్లు ఇచ్చారంట ?

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో కేవలం దినకరన్ అనుచరులు మాత్రం రూ. 80 కోట్ల వరకు పంచారని అధికారులు అంచనా వేస్తున్నారని, పోటీలో ఉన్న అభ్యర్థులు అందరూ కలిస్తే దాదాపు రూ. 200 నుంచి రూ. 300 కోట్ల వరకు ఓటర్లకు పంచిపెట్టి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి గారి ఇంటిలో

మంత్రి గారి ఇంటిలో


తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద, పలు ప్రాంతాల్లో జరిగిన ఆదాయపన్ను శాఖా దాడుల్లో ఆర్ కే నగర్ నియోజక వర్గంలో నగదు పంపిణి చేసిన వివరాలకు సంబంధించిన ఆధారాలు బాగానే దొరికాయని తమిళ మీడియా అంటోంది.

రూ. 2,000 కొత్త నోట్లు పంచిపెడుతున్న వీడియో

ఆర్ కే నగర్ లో ఓటర్లకు డబ్బులు పంచిపెడుతున్న ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఓ వ్యక్తి రూ. 2,000 నోట్లు రెండు (రూ. 4,000) ఒక్కొక్క ఓటరకు ఇస్తూ టీటీవీ దినకరన్ కే ఓటు వెయ్యాలని చెబుతున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో పరిశీలించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద దాడులు చేశారని సమాచారం.

ఓటుకు రూ. 4,000: వీడియోలో అడ్డంగా, దినకరన్ గ్యాంగ్ పరుగో పరుగు!ఓటుకు రూ. 4,000: వీడియోలో అడ్డంగా, దినకరన్ గ్యాంగ్ పరుగో పరుగు!

దాడులు కొనసాగుతున్నాయి

దాడులు కొనసాగుతున్నాయి

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శనివారం ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. . ఇప్పటి వరకు అధికారులు భారీ మొత్తంలో నగదు, నగలు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

English summary
On Friday nearly 100 taxmen descended upon Tamil Nadu and conducted a raid at various places after allegations of over Rs 80 crore being spent on the R K Nagar by-polls were made.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X