వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

80 మంది మృతి: శ్రామిక్ రైళ్లలో పయనించిన కార్మికుల మృత్యువాత..

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ వల్ల ఆయా చోట్ల చిక్కుక్కొన్న వలసకూలీలను తరలించేందుకు రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లను నడిపిస్తోంది. స్వస్థలాలకు రైళ్లు చేరుస్తోన్నా.. కూలీల చనిపోవడం కలచివేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 80 మంది కార్మికులు చనిపోయారని రైల్వేశాఖ తెలిపింది. చనిపోయిన 80 మంది వివరాలను అధికారులు ప్రకటించారు.

 గుంటూరులో కరోనా కలకలం: ఇద్దరు అటెండర్లకు సోకిన వైరస్, 190 కుటుంబాల ఆందోళన... గుంటూరులో కరోనా కలకలం: ఇద్దరు అటెండర్లకు సోకిన వైరస్, 190 కుటుంబాల ఆందోళన...

80 మందిలో ఒకరు కరోనా వైరస్ సోకిందని.. 11 మంది అనారోగ్యంతో మృతిచెందారని తెలిపారు. ఈ నెల 23వ తేదీన 10 మంది, 24, 25వ తేదీల్లో 9 మంది, 27వ తేదీన 8 మంది, 26వ తేదీన 13 మంది చనిపోయారని తెలిపారు. అలా మొత్తం 80 మంది చనిపోయారని పేర్కొన్నారు.

80 died on Shramik trains for migrants

వలసకూలీల కోసం రైల్వేశాఖ మే 1వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. లక్షలాది మందిని స్వస్థలాకు తరలిస్తోన్నా.. కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. బీహర్, పశ్చిమబెంగాల్, ఒడిశాకు ఎక్కువమంది కూలీలను తరలించారు. ఇటీవల ఓ రైలు చేరాల్సిన గమ్యం కాకుండా ఒడిశాకు తీసుకెళ్లడంతో కూలీలు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1 లక్ష 73 వేలకు చేరింది. 4900 మంది చనిపోగా.. 82 వేల మంది కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.

English summary
eighty people died between May 9 and May 27 on Shramik Special trains meant to ferry migrant workers home, according to Railways officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X