బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యలు పెట్టిన కేసుల్లో ఇండియాలోనే బెంగళూరు నెంబర్ వన్, భర్తలు క్యూ, లబోదిబో, హైదరాబాద్ లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: మహిళలపై దౌర్జన్యాలు, వరకట్నం వేధింపులు ఎక్కువగా ఏ నగరంలో ఉన్నాయి అనే విషయం వెలుగు చూసింది. జాతీయ నేరాల రికార్డుల విభాగం (ఎన్ సీఆర్ బీ) వెల్లడించిన వివరాల ప్రకారం బెంగళూరు నగరంలో మహిళలపై దౌర్జన్యాలు ఎక్కువ కావడంతో దేశంలోనే ఎక్కువ వరకట్నం వేధింపుల కేసులు నమోదైనాయని వెలుగు చూసింది. బెంగళూరు నగరం తరువాత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాలు ఉన్నాయి. భార్యలు వరకట్నం వేధింపుల కేసులు పెట్టడంతో భర్తలు కోర్టులను క్యూ కడుతున్నారు.

ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!

క్రైం విభాగం లెక్కలు

క్రైం విభాగం లెక్కలు

జాతీయ నేరాల రికార్డుల విభాగం 2018 లెక్కల ప్రకారం దేశంలో ఎక్కువగా ఎక్కడ వరకట్నం వేధింపుల కేసులు నమోదు అయ్యాయి అనే వివరాలు లెక్కించారు. బెంగళూరు నగరంతో సహ దేశంలోని మొత్తం 20 ప్రముఖ నగరాల్లో వరకట్నం వేధింపుల కేసుల వివరాలను సేకరించారు.

బెంగళూరులో 81 శాతం కేసులు

బెంగళూరులో 81 శాతం కేసులు

దేశంలోని 20 ప్రముఖ నగరాల్లో ఎక్కువగా వరకట్నం వేధింపుల కేసులు నమోదైయ్యింది బెంగళూరు నగరంలోనే అని వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మొత్తం 81 శాతం వరకట్నం వేధింపుల కేసులు నమోదు అయితే మిగిలిన 19 నగరాల్లో 19 శాతం వరటకట్నం వేధింపుల కేసులు నమోదైనాయి.

బెంగళూరులో భర్తల పని ఫినిష్ ?

బెంగళూరులో భర్తల పని ఫినిష్ ?

దేశంలోని మొత్తం 20 నగరాల్లో భర్తలు, వారి కుటుంబ సభ్యుల మీద భార్యలు 851 కేసులు పెట్టారు. అందులో ఒక్క బెంగళూరు నగరంలోనే 692 కేసులు నమోదైనాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో 159 వరకట్నం వేధింపుల కేసులు నమోదైనాయి. ఈ కేసులు అన్నీ వరకట్నం నిరోధక చట్టం కింద నమోదైనాయని రికార్డులు వెల్లడించాయి. మొత్తం మీద భార్యలు వరకట్నం వేధింపుల కేసులు పెట్టడంతో బెంగళూరు నగరంలో క్యూలో భర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వెలుగు చూసింది.

English summary
81 per cent Dowry Cases Reported in 2018 accross the indian major cities. according to national crime records bureau.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X