వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలిరాజ్యం: 85 ఏళ్ల బామ్మ కర్రసాము, మాట్లాడితే లీడర్స్ కు కరోనా వస్తుందా ?, రూ. వేల కోట్లు (వీడియో)

|
Google Oneindia TeluguNews

ముంబయి/ పూణే: ప్రపంచంలోని ప్రతిరాజకీయ నాయకుడు చెప్పే మాట ఒక్కటే. నేను అధికారంలోకి వస్తే మీ తలరాతలు మారిపోతాయి అని. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ప్రజల తలరాతలు మారడం ఏమో కాని చాలా మంది రాజకీయ నాయకుల తలరాతలు మాత్రం మారిపోయాయి. ప్రపంచంలోని ప్రతిమానవుడికి ప్రధాన శత్రువు ఆకలి. ఈ ఆకలిరాజ్యంలో పేదల ఆకలి తీర్చలేని కొందరు రాజకీయ నాయకులు ఇక ప్రజలను ఏమి ఉద్దరిస్తారో ? ఏమో ? ఆదేవుడికే తెలియాలి. 85 ఏళ్ల బామ్మ పొట్టకూటికోసం కర్రసాము విద్యతో ఈ రోజూ భిక్షం ఎత్తుకుంటున్న దృశ్యాలు చూసి అనేక మంది చలించిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే బయటకు వస్తే కరోనా వస్తుంది కానీ కొందరు ప్రజాప్రతినిధులు ఆ బామ్మ గురించి మాట్లాడితే ఎక్కడ కరోనా వస్తుందో ? అనే భయంతో నోరు మెదపకపోవడంతో సామాన్య ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Recommended Video

Bollywood Celebrities Ready To Help Shantabai Pawar

Mafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తోMafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తో

 నిన్నలక్షాధికారులే నేడు వేల కోట్లకు ఆసాములు

నిన్నలక్షాధికారులే నేడు వేల కోట్లకు ఆసాములు

నిన్నటి కొందరు రాజకీయ నాయకులు లక్షాధికారులు నేడు వందల కోట్ల రూపాయలకు పడగలుఎత్తారు. అయితే సామాన్య ప్రజలు లక్షాధికారులు కాదు కాద రోడ్లలో భిక్షం ఎత్తుకుంటున్నారు. ప్రపంచంలోని ప్రతిమానవుడికి ప్రధాన శత్రువు ఆకలి. ఆ ఆకలి తీర్చలేని కొందరు రాజకీయ నాయకులు ఇక ప్రజలను ఏమి ఉద్దరిస్తారో ? ఏమో ? ఆ దేవుడికే తెలియాలి. రాజకీయ నాయకులు అనుకుంటే ప్రత్యర్థులకు, విమర్శలు చేసే వాళ్లకు సినిమా చూపిస్తారు. అయితే పేదవారిని ఆదుకోవాలని ఎవరైనా పేదలు అడిగితే బిజీ అయిపోతారు. పాపం, సహాయం చెయ్యడానికి పలువురు ప్రజాప్రతినిధులకు చేతులుకూడా రావు.

 లాక్ డౌన్ దెబ్బకు 85 ఏళ్ల వయసులో బామ్మ !

లాక్ డౌన్ దెబ్బకు 85 ఏళ్ల వయసులో బామ్మ !

మహారాష్ట్రలోని పూణేలో శాంతాబాయి పవార్ (85) అనే బామ్మ నివాసం ఉంటున్నారు. లాక్ డౌన్ కారణంగా శాంతాబాయి పవార్ కుటుంబ సభ్యులు తినడానికి సరైన ఆహారం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొడుకులు, మనుమలు, మనుమరాళ్లు పడే కష్టం చూసి చలించిపోయిన శాంతాబాయి రెండు కర్రలు చేతిలో పట్టుకుని పూణే నగరంలోని వీధుల్లోకి వచ్చారు. అంతే తనకు తెలిసిన కర్రసాము ప్రదర్శించిన శాంతాబాయి కడుపుచూపిస్తూ ఎవరైనా మా ఆకలి తీర్చండి, మాకు సహాయం చెయ్యండి అంటూ భిక్షం ఎత్తుకుంటున్నారు.

 కోటి విద్యలు కూటి కోసమే

కోటి విద్యలు కూటి కోసమే

కోటి విద్యలు కూటి కోసమే అని పెద్దలు చెప్పిన మాట సత్యం అని శాంతాబాయి నిరూపించారు. ఈ వయసులో మీకెందుకు ఇంత కష్టం అని స్థానికులు శాంతాబాయిని ప్రశ్నించారు. తనకు 8 ఏళ్ల వయసులో తన తండ్రి కర్రసాము విద్య నేర్పించారు. అప్పటి నుంచి తాను కర్రసాము ప్రదర్శిస్తున్నాను. తనకు తెలిసిన కర్రసాము విద్యను తన పిల్లలకు, వారి పిల్లలకు నేర్పించాను. లాక్ డౌన్ సందర్బంగా మా కుటుంబ సభ్యులకు పనులు లేక ఆకలితో ఉంటున్నారని, వారి ఆకలి తీర్చడానికి తాను రోడ్ల మీద కర్రసాము చేస్తున్నానని శాంతబాయి దీనంగా చెప్పారు. శాంతాబాయి మాటలు విన్న స్థానికులు చలించిపోయి వారికి తోచినకాటికి సహాయం చేసి అయ్యో పాపం, ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది అంటూ శాంతాబాయి మీద జాలిచూపిస్తున్నారు. సిగ్గు పడకుండా, ఈ వయసులో నాకెందుకు అనుకోకుండా బామ్మ ఆమె పిల్లల కోసం కష్టపడం చూస్తే ఏ ఒక్కరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది.

 అమ్మాయిల కోసం కర్రసాము స్కూల్

అమ్మాయిల కోసం కర్రసాము స్కూల్

బామ్మ శాంతాబాయి కర్రసాము వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. శాంతాబాయి గురించి విషయం తెలుసుకున్న కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రముఖ బహుబాష నటుడు సోనూసూద్ అయితే శాంతాబాయి ఎక్కడ ఉన్నా ఆమె ఆచూకి తెలుసుకుని ఆదుకుంటానని, బామ్మతో కర్రసాము శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తానని, నేటి అమ్మాయిలు వారినివారు రక్షించుకోవడానికి ఇలాంటి విద్య ఎంతో అవసరం అని అన్నారు. మరో నటుడు రితేశ్ దేశ్ ముఖ్ శాంతాబాయిని తాను తప్పకుండా ఆదుకుంటానని, తనకు చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

మాట్లాడితే కరోనా వస్తుందా ?

ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ లేకుండా రోడ్ల మీదకు వచ్చినా, బహిరంగ ప్రదేశాల్లో తిరిగినా కరోనా వస్తుందని ప్రజలు, చాలా మంది రాజకీయ నాయకులు భయపడుతున్నారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు బామ్మ శాంతాబాయి పవార్ గురించి తెలిసితే ఎక్కడ మాట్లాడితే మాకు కరోనా వస్తుందో ? అనే భయంతో నోరు మెదపలేకపోతున్నారు. శాంతాబాయికి సహాయం చెయ్యడానికి ఏ రాజకీయ పార్టీ నాయకులు ముందుకు రాకపోవడంతో కొందరు పొలిటికల్ లీడర్స్ మీద సామాన్య ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

English summary
Lockdown: 85-year-old Shantabai Pawar performs 'Lathi Kathi' on streets of Pune to earn a livelihood. She says I’m doing it since I was 8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X