వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఘర్షణ: 86 మంది పోలీసులకు గాయాలు, చిక్కుకున్న 300 మంది కళాకారులు..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. వారిని అడ్డుకునే ప్రయత్నంలో జరిగిన ఘర్షణలో పోలీసులు గాయపడ్డారు. దాదాపు 86 మంది పోలీసులు గాయపడ్డారు. వారు సమీపంలో గల ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకునే క్రమంలో జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది.

86 cops injured in farmers protest, several admitted: Police

ఢిల్లీలో పరిస్థితిని కేంద్రం నిశీతంగా గమనిస్తోంది. అదనపు బలగాలను మొహరించి మరీ పరిస్థితిని అదుపులోకి తెవాలని అనుకుంటోంది. సీనియర్ అధికారులతో హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. అదనపు పారా మిలటరీ బలగాలను మొహరించారు. నిన్న 15 కంపెనీల బలగాలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం 5 కంపెనీల బలగాలు విధులు నిర్వర్తించాయి. ట్రాక్టర్ ర్యాలీ చేస్తూ.. ఎర్రకోటకు రైతు ప్రతినిధులు దూసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఎర్రకోటపై త్రివర్ణ పతాకంతోపాటు సిక్కుల జెండా కూడా ఎగరవేశారు. తర్వాత నినాదాలు చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు వారి నినాదాలు కొనసాగాయి. ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. అక్కడికి చేరిన పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు రైతుల ఆందోళనతో 200 కళాకారులు ఎర్ర కోట సమీపంలో చిక్కుకున్నారు. ట్రాక్టర్ వల్ల వారు అక్కడే ఉండిపోయారు. అయితే వారిని ఢిల్లీ పోలీసులు అక్కడినుంచి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని నార్త్ డీసీపీ తెలిపారు. దాదాపు 300 మంది కళాకారుల్లో చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వారికి ఆహారం అందజేసి.. సురక్షితమైన ప్రాంతానికి తరలించామని తెలిపారు.

Recommended Video

Farmers Tractor Rally: Protesters Enter Delhi's Red Fort, Wave Their Flags From The Ramparts

English summary
Eighty-six Delhi Police personnel were injured while containing the farmers' protest in the Delhi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X