వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదల పాలిట దేవుడు... మనసున్న డాక్టర్... కరోనా పీరియడ్‌లోనూ ఆగని నిస్వార్థ సేవ...

|
Google Oneindia TeluguNews

ఆయనో పేదల డాక్టర్... అంతకుమించి మనసున్న డాక్టర్... 87 ఏళ్ల వృద్దాప్యంలోనూ నిత్యం 10కి.మీ సైకిల్‌పై వెళ్లి పేద రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తుంటాడు. ప్రజలకు సేవ చేయాలన్న అంకితభావం,చిత్తశుద్ది ఉంటే... ఎంత పెద్ద సమస్యైనా దానికి అడ్డుకాబోదు అనడానికి ఆయనే ప్రత్యక్ష ఉదాహరణ. ఆ డాక్టర్ పేరు రామచంద్ర దండేకర్. ఓవైపు కరోనా విజృంభిస్తుండటంతో సీనియర్ సిటిజన్లంతా ఇళ్లకే పరిమితమైన వేళ... వైద్యులు సైతం కరోనా వైరస్‌కు భయపడుతున్న వేళ... అంత వృద్దాప్యంలోనూ రామచంద్ర దండేకర్ పేషెంట్లకు చికిత్స అందించడం మానుకోలేదు. అది కూడా... ఆయనే పేషెంట్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

60ఏళ్లుగా నిస్వార్థ సేవ...

60ఏళ్లుగా నిస్వార్థ సేవ...

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రామచంద్ర దండేకర్ ఓ హోమియోపతి వైద్యుడు. గత 60 ఏళ్లుగా చంద్రపూర్,బల్లార్షా,ముల్,పొంబుర్ణ తాలూకాల్లో ఆయన వైద్య సేవలు అందిస్తున్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే ఉదయాన్నే సైకిల్‌పై బయలుదేరుతారు. పేషెంట్ల ఇంటి వద్దకే వెళ్లి ఉచితంగా చికిత్స అందిస్తారు. అలా పేషెంట్ల కోసమే ప్రతీరోజూ దాదాపు 10-15కి.మీ సైకిల్‌పై ప్రయాణిస్తారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ ఆయన తన ఉచిత వైద్య సేవలను ఆపేయలేదు.

ఇప్పటి డాక్టర్లకు ఆ ఆలోచన లేదు..

ఇప్పటి డాక్టర్లకు ఆ ఆలోచన లేదు..

'గత 60 ఏళ్లుగా ప్రతీరోజూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి పేదలకు చికిత్స అందిస్తున్నాను. నిజానికి కరోనా వైరస్‌కు భయపడి చాలామంది వైద్యులు పేషెంట్లకు వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారు. కానీ నాకు అలాంటి భయాలేవీ లేవు. ఈరోజుల్లో యువ వైద్యులంతా ఎక్కువగా డబ్బు వెనకే పరిగెడుతున్నారు. పేదలకు సేవ చేయాలనే ఆలోచన వారికి ఉండట్లేదు.' అని డా.దండేకర్ అభిప్రాయపడ్డారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తన వైద్య సేవలను కొనసాగిస్తున్నానని... తన కాళ్లు రెక్కలు ఆడినన్ని రోజులు పేదలకు నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.

పేదల పాలిట దేవుడు..

పేదల పాలిట దేవుడు..

చంద్రపూర్ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. డా.దండేకర్ ఎప్పుడూ తమకు అందుబాటులో ఉంటాడని చెప్పారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు... సైకిల్‌పై వచ్చి ట్రీట్‌మెంట్ అందిస్తాడని తెలిపారు. 'ఒకరకంగా ఆయన మా పాలిట దేవుడు. ఏ క్షణం ఫోన్ చేసినా మరో మాట లేకుండా ఇంటికే వచ్చి చికిత్స అందిస్తారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో పేదల వద్దకు పరిగెత్తుకొచ్చే వైద్యుడు ఆయనొక్కరే. కరోనా పీరియడ్‌లోనూ ఆయన ఎవరినీ కాదనలేదు. ఏ పేద వ్యక్తి ఆయన వైద్య సాయం కోరినా ఉచితంగా సేవలందిస్తారు. అలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతోమంది పేదలకు ఆయన వైద్య సేవలందించారు.' అని చెప్పుకొచ్చారు.

English summary
While the COVID-19 phase led to hardships for many, healthcare facilities in villages were severely affected, but even during this crisis, an 87-year old doctor from Chandrapur continued braving the pandemic to reach his patients on a bicycle and provide them treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X