వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: టీచర్‌పై అసభ్యరాతలు, 88 మంది విద్యార్థినిల బట్టలిప్పారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇటానగర్: క్రమశిక్షణ పేరుతో ఓ స్కూల్‌లో 88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తప్పులు చేయకుండా వారిని సరిదిద్దాలి. కానీ, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను అవమానిస్తున్నారు. ఈ తరహ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి.

కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేసే శిక్షల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే తమ తప్పును తెలుసుకొని భవిష్యత్తులో ఆ తరహ తప్పులు చేయకుండా విద్యార్థులకు తెలిసేలా చేయడం శిక్షల ఉద్దేశ్యంగా ఉండాలి. కానీ, శిక్షల పేరుతో విద్యార్ధులను హింసించడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

 టీచర్‌పై విద్యార్థుఅ అసభ్యరాతలు

టీచర్‌పై విద్యార్థుఅ అసభ్యరాతలు

అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల స్కూల్‌లో క్లాస్ టీచర్‌పై విద్యార్థులు అసభ్యరాతలు రాశారు. అయితే విద్యార్థులు క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాసిన ఘటనపై టీచర్లు విద్యార్థులకు దారుణమైన శిక్షను అమలు చేశారు. టీచర్‌పై రాసిన అసభ్యరాతలకు సంబంధించిన కాగితం ముక్క పూర్తిగా దొరకలేదు. సగభాగం మాత్రమే విద్యార్థులకు అందింది. మిగిలిన సగభాగం కోసం విద్యార్థులపై కఠినంగా శిక్షను అమలు చేశారు ముగ్గురు టీచర్లు.

 88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టారు

88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టారు

క్లాస్ టీచర్‌పై అసభ్య రాతలు రాసిన కాగితం ముక్క కోసం 88 మంది విద్యార్థినులను తోటి విద్యార్థినుల ముందే బట్టలిప్పించారు. ఆరు, ఏడు తరగతులకు చెందిన విద్యార్థినుల బట్టలను విప్పి నిలబెట్టారు.విద్యార్థుల బట్టలు విప్పి కాగితం ముక్క కోసం వెతికారు.కాగితం ముక్క కోసం వెతికారు. కానీ, కాగితం ముక్క దొరకలేదు. కాగితం ముక్క కోసం విద్యార్థులను అలాగే నగ్నంగా నిలబెట్టారు.

 ముగ్గురు టీచర్లు విద్యార్థినులను శిక్షించారు

ముగ్గురు టీచర్లు విద్యార్థినులను శిక్షించారు

క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్యరాతలు రాశారు. ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారు. అయితే విద్యార్థినులను శిక్షించే ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్ కీలకంగా వ్యవహరించారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని టీచర్లు విద్యార్థులను హెచ్చరించారు.

 పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వాస్తవమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన దారుణమని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యాఖ్యానించింది.

English summary
Students of a girls’ school in Arunachal Pradesh were allegedly forced to undress by three teachers as a punishment for writing vulgar words against the head teacher.టీచర్‌పై అసభ్య రాతలు రాశారనే నెపంతో 88 మంది విద్యార్థులను తోటి విద్యార్థుల ముందే నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X