వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో గత 24 గంటల్లో 9,987 కొత్త కేసులు .. 72 లక్షలకు చేరిన ప్రపంచ కరోనా కేసులు !!

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకీ కరోనాఉధృతి పెరిగిపోతోంది. ఇక భారతదేశంలో కరోనాకేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.ప్రతినిత్యం పదివేలకు చేరువలో కరోనా కేసులు నమోదుకావడం ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.

Recommended Video

COVID-19 Cases Crossed 2,66,598 Mark In India, 9,987 New Cases Found In 24Hrs

యూకేకి దగ్గరగా భారత్: కరోనా కొత్త కేసుల్లో రోజుకో రికార్డు..ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలకు పైగా కేసులుయూకేకి దగ్గరగా భారత్: కరోనా కొత్త కేసుల్లో రోజుకో రికార్డు..ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలకు పైగా కేసులు

 మొత్తం కరోనా కేసులు 2,66,598 కేసులు

మొత్తం కరోనా కేసులు 2,66,598 కేసులు

ఇప్పుడు భారతదేశంలో మొత్తం కరోనా కేసులు చూస్తే 2,66,598 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు మొత్తం 1,29,917 మంది కేసులు యాక్టివ్ గా ఉండగా 1,29,215 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 7466 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక గత 24 గంటల్లో చూసినట్లయితే భారతదేశంలో 9987 కొత్త కేసులు, 331 మరణాలు సంభవించినట్లుగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

మహారాష్ట్రలో తగ్గని కరోనా ఉధృతి

మహారాష్ట్రలో తగ్గని కరోనా ఉధృతి

భారతదేశంలో కరోనావ్యాప్తి ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి అక్కడ లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేసింది సర్కార్. ఇక దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా కరోనాకేసులు నమోదవుతున్నాయి. దేశం మొత్తం మీద దారుణమైన పరిస్థితులు ఒక మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని ముంబై కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ అక్కడ కరోనా విస్తరిస్తూనే ఉంది.

ముంబై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు ఇండోర్ లలో పెరుగుతున్న కేసులు

ముంబై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు ఇండోర్ లలో పెరుగుతున్న కేసులు

దేశంలోని కంటై న్మెంట్ జోన్లతో పోలిస్తే ముంబై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు ఇండోర్ లలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మహారాష్ట్ర ఇప్పుడువరకు కరోనా కేసులు 88,528 గా ధృవీకరించు పడ్డాయి. దేశంలోనే కరోనా వైరస్ తో అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది.ఆ తర్వాత స్థానంలో తమిళనాడు 33,229 కేసులతో ఉంది. ఢిల్లీలో 29,943 కేసులు ఉన్నట్టు తెలుస్తుంది .

ప్రపంచవ్యాప్తంగా 72 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 72 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 71,93,476 మంది బాధితులుగా మారారు. ఇందులో 4,08,614 మందికిపైగా బాధితులు మరణించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 35,35,554 మంది కోలుకోగా, మరో 32,49,308 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో గత 24 గంటల్లో 18,663 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో యూఎస్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,26,493కి పెరిగింది. అమెరికాలో ఇప్పటివరకు 1,13,055 మంది బాధితులు మరణించారు. మరో 7,73,480 మంది కోలుకోగా, 11,39,958 మంది చికిత్స పొందుతున్నారు.

English summary
The total number of corona cases in India now stands at 2,66,598. A total of 1,29,917 cases were active while 1,29,215 were discharged. In the last 24 hours there have been 9987 new cases and 331 deaths in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X