వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో వరదలు: 120కి చేరిన మృతులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో వరదలు బీభత్స సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు దాదాపు 120 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దక్షిణ శ్రీనగర్‌లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు పూల్వామాలో 9 మంది జవాన్లు వరదలో కొట్టుకుపోయారు. సహాయక చర్యల్లో పొల్గొంటుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వీరిలో ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

మరో ఇద్దరు జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు జమ్మూకాశ్మీర్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 120 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 68మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

జీలం నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాశ్మీర్ లోయలోని 100 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పుల్వామా జిల్లాలో వరదల వల్ల జీలం నది కట్టకు గండి పడింది.

దక్షిణ శ్రీనగర్ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలోనూ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు డివిజనల్ కమిషనర్ చెప్పారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సమీక్షిస్తున్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

వరదలు

వరదలు

జమ్మూకాశ్మీర్‌లో వరదలు బీభత్స సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటి వరకు దాదాపు 120 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దక్షిణ శ్రీనగర్‌లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

వరదలు

వరదలు

మరోవైపు పూల్వామాలో 9 మంది జవాన్లు వరదలో కొట్టుకుపోయారు. సహాయక చర్యల్లో పొల్గొంటుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వీరిలో ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

వరదలు

వరదలు

మరో ఇద్దరు జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు జమ్మూకాశ్మీర్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 120 మంది మృత్యువాత పడ్డారు.

వరదలు

వరదలు

శుక్రవారం ఒక్కరోజే 68మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ శ్రీనగర్ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలోనూ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు డివిజనల్ కమిషనర్ చెప్పారు.

వరదలు

వరదలు

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సమీక్షిస్తున్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

English summary

 At least nine Army personnel, including an officer, were on Saturday washed away in strong water currents of Jhelum River as their boat capsized during a rescue operation in flood-affected Pulwama district of Kashmir, an Army official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X