వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెను విషాదం ప్రభుత్వ ఆస్పత్రిలో: గంటలోనే 9 మంది చిన్నారులు మృతి

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. కేవలం గంట సమయంలోనే 9 మంది శిశువులు మరణించారు. ఏడాది క్రితం కూడా ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. అప్పుడు కూడా భారీ సంఖ్యలో శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

బుధవారం రాత్రి జేకే లోన్ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు మరణించగా, గురువారం మరో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన చిన్నారులంతా 1-4 సంవత్సరాల వయస్సు పిల్లలే ఉన్నారని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

 9 Infants Dies Within Hours In Rajasthan Government Hospital: Report

ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ దులారా మాట్లాడుతూ.. చిన్నారుల మరణాలు సాధారణమైనవేనని తెలిపారు. డివిజనల్ కమిషనర్ కేసీ మీనా, జిల్లాా కలెక్టర్ ఉజ్జవల్ రాథోర్ గురువారం సాయంత్రం ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు.

చిన్నారుల మరణాలపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. శిశువుల చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. కాగా, చిన్నారుల మృతికి గల కారణాలు తెలియరాలేదు.

English summary
Jaipur: Nine newborn infants have died at a state-run hospital in Kota city of Rajasthan within a span of hours, officials said on Thursday, a year after the same facility had hit national headlines over the deaths of an unusual number of infants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X