వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క జనవరిలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: ఈపీఎఫ్ఓ

|
Google Oneindia TeluguNews

ఓ వైపు దేశంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తుంటే.... ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఈపీఎఫ్ఓ మాత్రం ఉద్యోగాలు భారీగానే జరిగినట్లు తమ పేరోల్ డేటా చెబుతోందని వెల్లడించింది. ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల కల్పన బాగానే జరిగినట్లు ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.

ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్‌కు అద్వానీ దూరంఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్‌కు అద్వానీ దూరం

ఒక్క జనవరిలోనే 9 లక్షల ఉద్యోగాలు

ఒక్క జనవరిలోనే 9 లక్షల ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కల్పన భారీగానే జరిగినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. గత 17 నెలల్లో ఎన్నడూ లేని విధంగా ఒక్క జనవరిలోనే 8.9లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు తమ డేటా చెబుతోందని ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 2018 నుంచి ఈపీఎఫ్ఓ ఉద్యోగాల సంఖ్యపై సమాచారం విడుదల చేస్తూ వస్తోంది. సెప్టెంబర్ 2017 నుంచి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ఏప్రిల్ 2018న విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

2017 సెప్టెంబర్‌లో 2.75 లక్షల ఉద్యోగాలు

2017 సెప్టెంబర్‌లో 2.75 లక్షల ఉద్యోగాలు

ఇక 2019 జనవరిలో 131 శాతం అధికంగా ఉద్యోగాలు లభించినట్లు తమ సబ్‌స్క్రైబర్స్ ద్వారా తెలుస్తోందని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 2017లో 2,75,609 ఉద్యోగాలు లభించినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఉద్యోగస్తులకు సంబంధించిన సామాజిక భద్రత పథకాలకు 76.48 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 2017 నుంచి జనవరి 2019 వరకు తీసిన డేటా ప్రకారం ఈ సంఖ్య ఉందని స్పష్టం చేసింది. ఈ సమాచారంతోనే గత 17 నెలల్లో ఎప్పుడూ లేనంతగా ఉద్యోగాల కల్పన జరిగిందని వెల్లడించింది.

ప్రతినెలా డేటా అప్‌డేట్ చేయడం జరుగుతుంది

ప్రతినెలా డేటా అప్‌డేట్ చేయడం జరుగుతుంది

ఈపీఎఫ్ఓ ఎన్‌రోల్‌మెంట్ ప్రకారం 2019 జనవరిలో 8 లక్షల 96వేల 516 ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించడం జరిగిందని వివరించింది. ఇక డేటా ప్రతి నెలా అప్‌డేట్ చేయడం జరుగుతుందని వెల్లడించింది ఈపీఎఫ్ఓ. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పేర్కొంది. కొంతమంది కొత్తగా ఈపీఎఫ్‌లో నమోదు చేసుకుంటారని మరికొందరు వదిలేసి తిరిగి నమోదు చేసుకుంటారని ఇలాంటి లెక్కలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించి అప్‌డేట్ చేస్తుంటామని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఇక తాత్కాలిక ఉద్యోగస్తులకు వచ్చే పీఎఫ్ అంతరాయం లేకుండా ఏడాది పొడవునా ఉండదని చెప్పిన ఈపీఎఫ్ఓ... సభ్యుల సమాచారం ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయడం జరిగిందని స్పష్టం చేసింది.

English summary
Net employment generation in the formal sector touched a 17-month high of 8.96 lakh in January, according to the latest EPFO payroll data.The EPFO has been releasing payroll data from April 2018, covering the period starting September 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X