వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంద మందికి చేరిన కోటా ఆస్పత్రి మృతుల సంఖ్య, ముగ్గురికి ఒకే బెడ్, తక్కువ బరువుతో జననం...

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్‌లోని కోటా ఆస్పత్రిలో చిన్నారుల మృత్యువాత కొనసాగుతూనే ఉంది. ఇటీవల 91 మంది చిన్నారులు చనిపోయారనే సంచలనం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు, నాలుగురోజులకు మరో 9 మంది చిన్నారులు మృతిచెందారనే అంశం ప్రతీ ఒక్కరిని తీవ్రంగా కలచివేస్తోంది.

ఐదుగురు తగ్గారట..

ఐదుగురు తగ్గారట..

9 మంది చిన్నారులతో కోటాలోని జేకే లాన్ ఆస్పత్రిలో చనిపోయిన మృతుల సంఖ్య వందకి చేరింది. ఈ నెల 23-24 తేదీల్లో 91 మంది వరకు చిన్నారులు చనిపోయారు. మూడు, నాలుగు రోజులకు మరికొందరు మృతిచెందారు. అయితే దీనిపై ఆస్పత్రి వర్గాలు తమదైనశైలిలో సమాధానం ఇస్తున్నారు. 2018లో 1005 మంది చనిపోతే.. 2019లో అది వెయ్యికి చేరిందని.. అంటే తగ్గిందని కవర్ చేసుకుంటున్నారు.

తక్కువ బరువుతో...

తక్కువ బరువుతో...


ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారులు తక్కువ బరువుతో జన్మిస్తున్న సూపరింటెండెంట్ పేర్కొన్నారు. చిన్నారుల మృతిపై దుమారం రేగడంతో మంగళవారం కోటా ఆస్పత్రిని బీజేపీ పార్లమెంటరీ సభ్యులు లాకెట్ ఛటర్జీ, కాంతా కర్దామ్, జాస్కౌర్ మీనా తదితరులు పరిశీలించారు. ఆస్పత్రిలో మౌలిక వసతుల సదుపాయాల కల్పనను పరిశీలించారు.

ముగ్గురికి ఒక్కటే బెడ్..

ముగ్గురికి ఒక్కటే బెడ్..

ఆస్పత్రిలో ఇద్దరు, లేదంటే ముగ్గురు చిన్నారులు ఒకే పడక మంచంపై ఉంచినట్టు గుర్తించారు. అలాగే చిన్నారులకు సరిపడ నర్సులు లేరని గుర్తించారు. అంతకుముందు జాతీయ చిన్నారుల హక్కుల కమిషన్ సభ్యులు రాజస్థాన్ ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీచేశారు.

ఆస్పత్రి కంపౌండ్‌లో పందులు

ఆస్పత్రి కంపౌండ్‌లో పందులు

ఆస్పత్రి పరిసరాల్లో పందులు కూడా తిరుగతాయని చైర్మన్ కనూంగో పేర్కొన్నారు. ఇది కూడా చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉంటుందని తెలిపారు. అయితే రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం చిన్నారులకు సరైన వైద్యం అందజేశారని పేర్కొనడం విశేషం.

English summary
nine more infants have died in the last two days of December at the JK Lon hospital here, taking the death toll to 100 for the month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X