వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్దాక్షిణ్యంగా... అత్తను చంపిన 9 ఏళ్ల బాలుడు... కుటుంబ పరువు తీసిందని...

|
Google Oneindia TeluguNews

10 ఏళ్ల క్రితం ఆ మహిళ తాను ఇష్టపడ్డ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులు,బంధువులను ఎదిరించి అతన్ని వివాహమాడింది. కాలం అలా గడిచిపోతూ ఉంటే... కొన్నేళ్లకు తన కుటుంబం,బంధువులు మనసు మార్చుకున్నారు. ఆమెను మళ్లీ చేరదీశారు. దీంతో ఇరువురి మధ్య మళ్లీ సత్సంబంధాలు మొదలయ్యాయి. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ కుటుంబం చూపించిన ప్రేమ,ఆప్యాయత వట్టిదేనని తేలిపోయింది. ఇంతకీ ఏం జరిగింది....

భర్త అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నా... విడాకులు ఇప్పించండి... ఓ భార్య విచిత్ర కేసు...భర్త అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నా... విడాకులు ఇప్పించండి... ఓ భార్య విచిత్ర కేసు...

ఎవరా మహిళ...

ఎవరా మహిళ...

పాకిస్తాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌‌లోని సర్గోదా గ్రామానికి చెందిన ఓ మహిళ(30) 10 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు,బంధువులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి అతన్ని వివాహమాడింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. మొదట్లో ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆమె కుటుంబం,బంధువులు కొన్నేళ్లకు మనసు మార్చుకున్నారు. మళ్లీ ఆమెను చేరదీయడంతో ఇరువురి మధ్య రాకపోకలు మొదలయ్యాయి.

కాల్చి చంపిన 9ఏళ్ల మేనల్లుడు...

కాల్చి చంపిన 9ఏళ్ల మేనల్లుడు...

ఇదే క్రమంలో మంగళవారం(సెప్టెంబర్ 22) ఆ మహిళ తన మేనమామ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైంది. ఫంక్షన్ జరుగుతున్న సమయంలో 9 ఏళ్ల ఆమె మేనల్లుడు గన్‌తో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ వెంటనే బాలుడి కుటుంబం అక్కడి నుంచి పరారైంది. కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అత్త తమ పరువు తీసిందన్న ఉద్దేశంతోనే ఆ బాలుడు ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

Recommended Video

పాక్ కి హ్యాండిచ్చిన PepsiCo, స్పాన్సర్ల వేట లో PCB || Oneindia Telugu
కుటుంబమే అతన్ని పురిగొల్పింది...

కుటుంబమే అతన్ని పురిగొల్పింది...

నిజానికి ఆ బాలుడికి గన్ ఎలా వాడాలో అతని కుటుంబమే శిక్షణ ఇచ్చిందని.. అత్తపై కాల్పులు జరపాలని కూడా వారే చెప్పారని పోలీసులు తెలిపారు. బాలుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా,పాకిస్తాన్‌లో ఇలాంటి పరువులు హత్యలు చాలా సహజం. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం... ప్రతీ ఏటా దాదాపు వెయ్యి మంది మహిళలు పాకిస్తాన్‌లో పరువు హత్యలకు గురవుతున్నారు.

English summary
In a suspected case of dishonour killing, a nine-year-old boy shot dead his aunt after being told by his family to commit the crime in a village in Pakistan's Punjab province, the police said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X