• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆన్ లైన్ గేమింగ్ పిచ్చి ..తండ్రికే టోకరా వేసిన తొమ్మిదేళ్ళ బాలుడు .. ఏం చేశాడంటే

|

మన దేశంలో సాంకేతికత అభివృద్ధి చెందినందుకు సంతోష పడాలో లేక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పెడదారి పడుతున్న చిన్నారుల పరిస్థితులు చూసి బాధ పడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ పెరిగిన తరువాత మొబైల్ ఫోన్లు, వాటితో పాటే ఆన్ లైన్ గేములు పెద్దల కంటే ఎక్కువ పిల్లల్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇంటికి వస్తే చాలు మొబైల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ తమదైన లోకంలో మునిగిపోతున్నారు చాలా మంది చిన్నారులు. అలాగేమింగ్ పిచ్చి ఓ పసివాడిని సైబర్ నేరగాడిని చేసింది.

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మృగాల 500వ దాడి ... జగన్100 రోజుల పాలనకు అంకింతం చేశారన్న లోకేష్

 ఆన్ లైన్ గేమ్ ల వ్యసనంలో భవిష్యత్ నాశనం చేసుకుంటున్న చిన్నారులు

ఆన్ లైన్ గేమ్ ల వ్యసనంలో భవిష్యత్ నాశనం చేసుకుంటున్న చిన్నారులు

ఇప్పటికే ఆన్ లైన్ గేమ్ ల వ్యసనంలో భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు చిన్నారులు . ఒకప్పుడు బ్లూ వేల్, ఇప్పుడు పబ్జి లాంటి ప్రమాదకరమైన గేమ్స్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ గేమింగ్ అనేది పిల్లల పాలిట వ్యసనంగా మారింది. ఇప్పటికే పబ్జి కోసం ప్రాణాలు తీసుకున్న చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. అదలా ఉంటే ఒక 9 ఏళ్ల బాలుడు ఆన్ లైన్ లో ఆటలు ఆడటం కోసం ఏకంగా తండ్రికే టోకరా పెట్టారంటే పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. తల్లి దండ్రుల పర్యవేక్షణ లేకుండా టెక్నాలజీని వాడుతున్న చిన్నారుల మానసిక స్థితి ఎలా మారుతుందో అర్ధం అవుతుంది.

తండ్రికి తెలీకుండా 35000 పేటియం ద్వారా ఆన్లైన్ గేమ్ ల కోసం ఖర్చు చేసిన 9ఏళ్ళ బాలుడు

తండ్రికి తెలీకుండా 35000 పేటియం ద్వారా ఆన్లైన్ గేమ్ ల కోసం ఖర్చు చేసిన 9ఏళ్ళ బాలుడు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కూడా ఓ నాలుగో తరగతి బాలుడు చేసిన ఘనకార్యం తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎప్పుడు ఖాళీ దొరికినా తండ్రి ఫోన్ తీసుకొని గేమ్ లు డౌన్ లోడ్ చేస్తూ ఆటలాడుకునే ఆ బాలుడు ఆన్లైన్ గేమ్ డౌన్లోడ్ చేయాలంటే డబ్బులు కట్టాలి కాబట్టి ఏకంగా తండ్రికే టోకరా వేశాడు తండ్రికి తెలియకుండా 35000 పేటియం ద్వారా ఆన్లైన్ గేమ్ ల కోసం ఖర్చు చేసాడు. ప్రతిరోజు ఫోన్ తీసుకొని ఆటలాడుకుంటున్న కొడుకు చేస్తున్న పని తండ్రి కి అర్థం కాలేదు. తీర అకౌంట్లో డబ్బులు అనేసరికి ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరో సైబర్ నేరగాళ్లు తన ఖాతాలో డబ్బులు తీస్తున్నారని భావించి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు సదరు తండ్రి.

సైబర్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం .. కొడుకు చేసిన పనికి షాక్ తిన్న తండ్రి

సైబర్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం .. కొడుకు చేసిన పనికి షాక్ తిన్న తండ్రి

ఇక పోలీసులు ఆరా తీసి కొడుకు చేసిన ఘనకార్యం తండ్రికి చెప్పి అసలు విషయం బహిర్గతం చేశారు. ఆన్ లైన్ గేములు డౌన్ లోడ్ చేయాలంటే అందుకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దీంతో ఆ డబ్బులు ఎలాకట్టాలో తెలియక బాలుడు సతమతమయ్యాడు. ఆ గేములు ఆడాలనే ఆత్రుతతో తండ్రి మొబైల్ లోనే తండ్రికే తెలియకుండా పేటీఎం వ్యాలెట్ ను సృష్టించిన నాలుగోతరగతి బాలుడు.. ఆన్ లైన్ లో గేమ్ లు కొని డౌన్ లోడ్ చేసుకుంటూ తండ్రి పేటీఎం ద్వారా ఏకంగా 35000 ఖర్చు చేశాడు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు గుట్టు రట్టయింది. 9 ఏళ్ల బాలుడు ప్రశ్నించగా ఆన్ లైన్ గేమ్ ల కోసం తనే చేశానని ఒప్పుకున్నాడు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అనంతరం ఇంటికి పంపారు. కొడుకు చేసిన పనికి ఏం చేయాలో పాలుపోని తండ్రి ఇకనుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగిస్తున్నప్పుడు తన కొడుకు పై ఒక కన్నేసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ తండ్రి మాత్రమే కాదు, దేశంలోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందరికీ ఈజీగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని పిల్లలు వినియోగిస్తున్న సమయాల్లో ఓ లుక్కేసి పెట్టకుంటే కచ్చితంగా కష్టాలు కొని తెచ్చుకున్నట్టే.

English summary
Class 4 student in UP capital Lucknow cheated his father and took out thousands of rupees from his bank account to play online games while the man went to the cyber crime cell over the unauthorised transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X