వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ అభ్యర్థిత్వం: రైటర్ జావెద్ అక్తర్ సంచలన వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

90% Indians oppose Narendra Modi: Javed Akhtar
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్ గురువారం సామాజిక వెబ్‌సైట్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా మోడీని వ్యతిరేకిస్తున్న వారిని బిజెపి దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో అక్తర్ సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్‌లో స్పందించారు. కొందరు ఇడియట్స్ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని జాతి వ్యతిరేక యాక్టివిటీగా చెబుతున్నారని, అలా అయితే వారు 90 శాతం మంది భారతీయులను దేశ ద్రోహులుగా చెబుతున్నారా అని ప్రశ్నించారు.

మోడీని వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించినట్లయితే దేశంలో 90 శాతం మంది ఆయనను వ్యతిరేకిస్తున్నారని, వారంతా దేశ ద్రోహులవుతారా అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

తనకు మోడీ అభిమానుల నుండి అసభ్యకర సందేశాలు వచ్చాయని, వాటిని చూస్తే వారి 'లో క్వాలిటీ' అర్థమవుతోందని ట్వీట్ చేశారు. మోడీ మంచి ప్రధానమంత్రి కాలేడని గతంలో అక్తర్ అన్నారు.

అయితే జావెద్ అక్తర్ వ్యాఖ్యలు నరేంద్ర మోడీ అభిమానులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. పాట్నాలోని హూంకార్ ర్యాలీ సమయంలో మోడీ చరిత్రను వక్రీకరించారని అక్తర్ ఇంతకుముందు జావెద్ అక్తర్ విమర్శలు చేశారు.

English summary
In a comment which could snowball into a controversy, acclaimed writer-lyricist Javed Akhtar on Thursday said that some people think that opposing BJP's prime ministerial candidate Narendra Modi is an anti-national activity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X