వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: 90 శాతం మంది రాజ్యసభ ఎంపీలు కోటీశ్వరులు! 51 మందిపై క్రిమినల్ కేసులు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీలలో దాదాపు 90 శాతం మంది కోటీశ్వరులేనట. ఒక్కో రాజ్యసభ సభ్యుడి సగటు ఆస్తి ఎంతో తెలుసా? రూ.55 కోట్లు. ఇవేవో కాకిలెక్కలు కాదు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

మొత్తం 233 మంది సిట్టింగ్ రాజ్యసభ ఎంపీల్లో 229 మంది స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఏడీఆర్ ఈ డేటాను రూపొందించింది. 229 మంది సిట్టింగ్ ఎంపీల్లో 201 మంది (88 శాతం) మంది కోటీశ్వరులేనని, ఒక్కో రాజ్యసభ సభ్యుని సరాసరి ఆస్తి రూ.55.62 కోట్లు అని ఆ నివేదిక తెలిపింది.

 90% Rajya Sabha MPs are crorepatis: ADR report

కోటీశ్వరులైన రాజ్యసభ సభ్యుల జాబితాలో.. మహేంద్ర ప్రసాద్ (జనతాదళ్-యునైటెడ్) అత్యధికంగా రూ.4078.41 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయాబచ్చన్ రూ.1001.64 కోట్లతో రెండో స్థానంలోనూ, బీజేపీకి చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా రూ.857.11 కోట్లతో మూడోస్థానంలోనూ ఉన్నారు.

పార్టీల వారీగా చూస్తే, 64 మంది బీజేపీ ఎంపీల్లో ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి విలువ రూ.27.80 కోట్లుగా ఉంది. 50 మంది కాంగ్రెస్ ఎంపీల విషయానికొస్తే...ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి రూ.40.98 కోట్లు. 14 మంది ఎంపీలున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి విలువ రూ.92.68 కోట్లు.

అంతేకాదు, ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. 229 మంది రాజ్యసభ ఎంపీల్లో 51 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. సుమారు 20 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.

మరోవైపు 154 మంది ఎంపీలు పలు రుణ వితరణ సంస్థలకు బాకీపడి ఉన్నారు. ఇక ఇలా రుణ వితరణ సంస్థలకు బాకీ పడి ఉన్న వారిలో చూసుకుంటే.. సంజయ్ దత్తాత్రేయ కఖడే అత్యధికంగా రూ.304.60 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

English summary
Nearly 90 per cent of the Rajya Sabha MPs are crorepatis while the average of total assets Upper House parliamentarians is Rs 55 crore, says a report. The report is based on an analysis of the self-sworn affidavits of 229 out of 233 sitting Rajya Sabha MPs by the National Election Watch and Association for Democratic Reforms (ADR). "Out of the 229 sitting Rajya Sabha MPs analysed, 201 (88 per cent) are crorepatis," a report by Delhi-based think-tank ADR said today, adding "the average of assets per Rajya Sabha MP is Rs 55.62 crore". Mahendra Prasad of Janata Dal (United) has the highest assets worth Rs 4,078.41 crore among the Rajya Sabha MPs. Samajwadi Party's Jaya Bachchan is at second place with assets worth Rs 1,001.64 crore, followed by BJP's Ravindra Kishore Sinha with assets worth Rs 857.11 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X