వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి కారులో 91.5 లక్షలు స్వాధీనం ...బర్తరప్ చేయాలన్న విపక్షాలు

మహారాష్ట్ర సహాకార శాఖ మంత్రి సుభాష్ దేశ్ ముఖ్ మంగళ్ గ్రూప్ ను నిర్వహిస్తున్నాడు. ఈ గ్రూప్ కు చెందిన వాహానంలో పోలీసులు 91.5 లక్షల నగదును గురువారం నాడు స్వాధీనం చేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర:;పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం ప్రతి ఒక్కరికీ ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. రాజకీయనాయకులు,కార్పోరేట్ సంస్థలు తమ వద్ద ఉన్న పెద్ద నగదును మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. మహారాష్ట్రలో మంత్రి కారు నుండి సుమారు కోటి రూపాయాలను స్వాధీనం చేసుకొన్నారు. మంత్రి వర్గం నుండి ఆయనను భర్తరప్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మహారాష్ట్ర సహాకార శాఖ మంత్రి సుభాష్ దేశ్ ముఖ్ కు చెందిన వాహానంలో ఈ నగదు దొరకడంతో రాజకీయంగా ప్రకంపనలు రేగుతున్నాయి. ఈయనకు లోక్ మంగల్ గ్రూపు కూడ ఉంది. ఈ గ్రూపు వాహానంలో 91.5 క్షలను నగదును తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.

91.5 lakh seized from ministers vehicle

వాహానాల తనిఖీల్లో భాగంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఈ నగుదను స్వాధీనం చేసుకొన్నట్టు కలెక్టర్ ప్రశాంత్ నార్నావలే చెప్పారు. ఈ డబ్బును ఉమర్గా ట్రెజరీలో జమ చేశామని చెప్పారు.ఈ డబ్బుకు సంబంధించి ఆధారాలను చూపాలని అధికారులు మంగళ్ గ్రూప్ కు నోటీసులు పంపారు.

మంగళ్ గ్రూపు నడుపుతున్న చక్కెర కర్మాగారంలోని సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు తీసుకెళ్తున్న నగదుగా మంత్రి వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణతో విపక్షాలు సంతృప్తిచెందలేదు.నల్లధనాన్ని తీసుకెళ్తూ మంత్రి దొరికిపోయారని ఎన్ సి పి ఆరోపించింది. ఆయను మంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.

English summary
maharastra cooperative minister subash desh mukh run a mangal group.mangal group running a sugar factory. magal group vehicle transport 91.5 lakh. police seized this amount.this amount for salaries of sugar factory employees said minister. opposition parties demanded to dismiss subash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X