వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ 4 వీసాల్లో 93 శాతం ఇండియన్స్‌కే: రిపోర్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలో హెచ్‌-4 వీసాలు పొందిన వారిలో 93 శాతం మంది ఇండియన్స్ ఉన్నారని తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాముల కోసం ఈ హెచ్‌-4 వీసాలు మంజూరు చేస్తారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో సుమారు ఐదోవంతు కంటే ఎక్కువ మంది హెచ్ 4 వీసాలు పొందినవారున్నారని ఆ నివేదిక వెల్లడిస్తోంది. ఉపాధి కోసం మంజూరు చేసిన హెచ్ 4 వీసాల్లో 93 శాతం మహిళలకు జారీ చేస్తే, 7 శాతం పురుషులకు ఇచ్చినట్టుగా ఈ నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

యూఎస్‌ కు చెందిన సీఆర్‌ఎస్‌ సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. యూఎస్‌ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాలానుగుణంగా ఈ సంస్థ నివేదికలను సిద్ధం చేస్తుంది.

93 percent of H4 visas in US belong to Indians

హెచ్‌4 కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారత్‌కు చెందిన వారికి మంజూరు చేశాం. చైనాకు 5 శాతం మంజూరు కాగా.. ఇతర దేశాలకు చెందిన వారికి 2 శాతం వీసాలిచ్చినట్టు అని సీఆర్‌ఎస్‌ తన 9 పేజీల నివేదికలో వెల్లడించింది.

2017, డిసెంబర్‌ 25 నాటికి హెచ్‌4 వీసాదారుల 1,26,853 దరఖాస్తులను అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ఆమోదించింది. వీటిలో 90,946 ప్రాథమిక ఆమోదాలు పొందాయి. 35,219 రెన్యూవల్స్‌, 688 కార్డులు కోల్పోయిన వారి కోసం జారీ చేసినవి ఉన్నాయి.

English summary
A huge 93 per cent of the H4 Visas, which allow work authorisation, in the US belong to Indians, a latest Congressional report on the spouse visa has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X